కోడి ‘గుడ్డు’ పెట్టలేదా?.. చంద్రబాబు సొంత జిల్లాలో చేతివాటం.. ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ్న భోజనం అందించడానికి పలువురికి కాంట్రాక్టులు ఇచ్చారు. పాఠశాలల్లో మద్యాహ్నం భోజనంలో ఏమేమి ఇవ్వాలి అంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం మోనూ ఇచ్చింది. అన్నం, ఆకుకూర, పప్పు కూర, కోడిగుడ్డు విద్యార్థులకు వడ్డించాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం సూచించింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యాహ్నం భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్లు ఇప్పటికి కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ఎమ్మెల్యే అయ్యారు అని కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలకు మద్యాహ్న భోజనం సక్రమంగా అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్లు, విద్యాశాఖలోని కొందరు అధికారులు ఇంకా వైసీపీ మూడ్ లో నుంచి బయటకు రాలేదని తెలిసింది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 2, 448 ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ్న భోజనం అందిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి మద్యాహ్న భోజనంలో సగం పాఠశాలల్లో కోడిగుడ్డు పెట్టలేదని వెలుగు చూసింది. 1,200 పాఠశాల్లో మద్యాహ్న భోజనంలో అన్నం, ఆకుకూర, పప్పుకూరతో పాటు కోడిగుడ్డు అందించారు. అయితే 1,248 ప్రభుత్వ పాఠశాల్లో మద్యాహ్న బోజనంలో అన్నం, పప్పు కూర మాత్రం వడ్డించారని, కోడిగుడ్డు వడ్డించలేదని వెలుగు చూసింది.
పాఠశాలలు ప్రారంభం కావడంతో మూడు రోజుల క్రితమే విద్యాశాఖ అధికారులు కోడిగుడ్లు సరఫరా చేసే ఏజెన్సీకి కోడిగుడ్లు పంపించాలని చెప్పారని తెలిసింది. విద్యాశాఖ అధికారులు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో మేము సరైన వాహనాలు, కూలీలను సమకూర్చుకోలేకపోయామని, అందుకే తక్కువ పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేశామని ఏజెన్సీ అంటోందిని తెలిసింది. విద్యాశాఖ అధికారులు, మద్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు నిర్లక్షం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కోడిగుడ్డు అందడం లేదని తెలిసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications