జగన్ యాత్ర లెక్కనే: రాహుల్ గాంధీ పాదయాత్రపై రావుల వ్యాఖ్య
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యాత్రకు, కాంగ్రెసు యువరాజ్ రాహుల్ గాంధీ యాత్రకు పెద్ద తేడా లేదని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రజలు, రైతాంగం బాధల్లో ఉంటే రాహుల్ గాంధీ ఆనందోత్సాహాలు, కేరింతల మధ్య యాత్ర చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
రాహుల్‌గాంధీపై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ శాసనసభా పక్ష నేత (టీడీఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 24వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకుంటే, రాహుల్ అప్పుడు ఎందుకు పరామర్శించలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్లే బాబ్లీ నిర్మాణం జరిగి ఎస్సారెస్పీ ఎడారిగా మారిందని ఆయన అన్నారు.

ఆ పాపంలో అప్పటి కేంద్రమంత్రి అయిన కేసీఆర్‌కు భాగస్వామ్యం ఉందని ఆయన విమర్శించారు. ప్రాణహిత -చేవెళ్లను మెదక్‌కే పరిమితం చేయాలనుకుంటున్నారని, పాత డిజైన్ ప్రకారమే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా కోసం పోరాడమంటే నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేత వేం నరేందర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ నిర్ణయాలు మహారాష్ట్రకు ప్రయోజనం చేకూర్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతుల సంక్షేమంకోసం కమిటీ ఇచ్చిన నివేదికలన్నీ బుట్టదాఖలయ్యాయని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.












Click it and Unblock the Notifications