ఐటీ రైడ్స్ 5వ రోజు: చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో కొనసాగుతోన్న సోదాలు, జీఎస్టీ, ఈడీ అధికారులు కూడా?
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాసరావు ఇంట్లో వరుసగా ఐదోరోజు సోదాలు కొనసాగుతోన్నాయి. అమరావతిలో గల గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్‌మెంట్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఒకటి లేదంటే రెండురోజుల్లో సోదాలు పూర్తవుతాయి.. కానీ ఐదు రోజుల నుంచి తనిఖీలు కొనసాగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

పోలీసులకు కూడా..
సీఆర్పీఎఫ్ బలగాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైడ్ చేసే సమయంలో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. స్థానిక పోలీసులను కూడా అలో చేయడం లేదు. సోదాల్లో ఎంత డబ్బు లభించింది..? డాక్యుమెంట్ల మొత్తం ఎంత..? తదితర అంశాలను వెల్లడించడం లేదు. సోదాల వివరాలను మాత్రం ఐటీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఐటీ అధికారులు కీలక పత్రాలు సేకరించినట్టు తెలుస్తోంది. గత 96 గంటల నుంచి శ్రీనివాసరావును ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది.

జీఎస్టీ, ఈడీ కూడా..?
ఐటీ అధికారులతో పాటు జీఎస్టీ, ఈడీ అధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. కానీ దీనిని ఐటీ అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. ఎన్నికలకు ముందు నగదు బదిలీ జరిగిందని.. ఫండ్ ట్రాన్స్‌ఫర్ జరిగిన సమయంలో సంభాషణలకు సంబంధించి వివరాలు సేకరించారు. అందులో శ్రీనివాస్ నంబర్ కూడా ఉండటంతో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపైనా కూడా క్లారిటీ లేదు.

సీఆర్పీఎఫ్ భద్రత మధ్య..
శ్రీనివాసరావు 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు పీఎస్‌గా పనిచేశారు. ప్రస్తుతం జీఏడీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తే ప్రతికూలత ఎదురవుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బందిని తమ వెంట తీసుకొచ్చారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు











Click it and Unblock the Notifications