విజయవాడ మీదుగా వెళ్తున్నారా.. కాస్త చింతించాల్సిన విషయమే!
విజయవాడ : విజయవాడ రైల్వే స్టేషన్ పై ఫోకస్ పెట్టిన రైల్వేశాఖ.. స్టేషన్ లో మౌలికసదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టింది. భద్రతా ఏర్పాట్ల విషయంలో మరిన్ని సౌకర్యాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.
విజయవాడ రైల్వే పరిధిలోని రైలు పట్టాలను కూడా ఆధునికీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సెప్టెంబర్ 20 నుంచి 28 వరకు పలు రైళ్ల రాకపోకల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతేకాదు ఈ ఎనిమిది రోజుల పాటు విజయవాడ మీదుగా వెళ్లే.. 320 రైళ్లను రైల్వే శాఖ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరో 361 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు 215 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడ మీదుగా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ అవస్థలు తప్పేటట్లు లేదు.












Click it and Unblock the Notifications