చంద్రబాబు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే నిప్పులు

జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించకోవడానికి తిరుమతి వచ్చారు.అయితే ఆయన వచ్చిన సమయంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై అనిరుధ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తిరుపతి దేవస్థానానికి సిఫార్సు లేఖలతో వచ్చినవారిని దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు.

ఏపీ చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు మాదిరిగా అని చెప్పారని, కానీ ఇక్కడ పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలపై వచ్చిన వారిని అనుమతించడం లేదని వాపోయారు. అంటే సీఎం చంద్రబాబు ఇప్పుడొక కన్నును తీసేసుకుంటారా అని ప్రశ్నించారు.ఏపీ నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు.

Jadcherla MLA Anirudh Reddy Fires On AP CM Chandrababu

ముఖ్యంగా యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలకు భక్తులకు స్పెషల్ దర్శనాలు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. కానీ తమ పార్టీ మనుషులు వస్తే మాత్రం ఇక్కడ రూమ్స్ కూడా ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అధికారంలో ఒక ప్రభుత్వం ఉంటే.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతారని, అయినా తాము ఏనాడు ఒక్కమాట కూడా అనలేదన్నారు.

ఏపీ వాళ్లు హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకున్నా తాము ఎప్పుడు ప్రశ్నించలేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తిరుమలలో తమ వారికి జరిగినట్టు , తెలంగాణలో మీకు జరిగిదే ఆ బాధ ఏంటో తెలుస్తుందని కూటమి నేతలకు చురకలు అంటించారు. తిరుమల దర్శనాలకు తెలంగాణ నేతలు ఇచ్చే సిఫార్సు లేఖల్ని అనుమతించకపోతే.. తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, తర్వాత మీరే బాధపడతారని చంద్రబాబు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకుని ప్రొటోకాల్ పాటించాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారాయన. ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+