జగన్ ఆటంబాంబులు ... దీపావళి స్పెషల్; ఏపీలో భారీగా కొనుగోళ్ళు, వైరల్ అవుతున్న ఫోటోలు !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జగన్ పేరు చెబితేనే వైసీపీ శ్రేణుల్లో, జగన్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అలాంటిది జగన్ పేరు మీద ఆటం బాంబులు మార్కెట్లకు వచ్చాయంటే ఇక వాటికుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఆటంబాంబులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
దీపావళి పండుగ నాడు బాణాసంచా కాల్చడం పై యువతకు ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, మతాబులు, సీమ టపాకాయలు, వంకాయ బాంబులు, లక్ష్మీ బాంబులు ఇలా బాణసంచా ను కొనుగోలు చేసి చిన్న పెద్ద, ముసలి ముతకా, పేద ధనిక తేడా లేకుండా అందరూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి మార్కెట్లోకి కొత్తగా జగన్ ఆటంబాంబు వచ్చింది. ఇవి గట్టిగా పేలడంతో పాటుగా, ధర కూడా అందుబాటులో ఉండడంతో జనాలు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.

బాణాసంచా అమ్మకందారులు వాటిని ప్రమోట్ చేసుకోవడానికి ఏకంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుని వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క జగన్ ఆటంబాంబు మాత్రమే కాదు, జగన్ భూచక్రాలు, చిచ్చుబుడ్లు కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఆటంబాంబు అయితే అన్నిటికంటే వేగంగా అమ్ముడు పోతున్నాయని వ్యాపారవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆటం బాంబుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు ఎవరికి తోచిన కామెంట్లు వాళ్లు పెడుతూ జగన్ ఆటంబాంబు లను డిస్క్రైబ్ చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన నాయకుడు కాబట్టి కడప బాంబులకు పెట్టింది పేరు కాబట్టి జగన్ ఆటంబాంబులు గట్టిగా పేలుతాయి అని సెటైర్లు వేస్తున్నారు. గతంలో బాహుబలి పేరుతో బాంబులు హల్చల్ చేయగా ప్రస్తుతం కాస్త డిఫరెంట్ గా జగన్మోహన్ రెడ్డి పేరుతోనే బాణాసంచా మార్కెట్లోకి వచ్చింది. జగన్ పేరు పెడితే బాణాసంచా విపరీతంగా అమ్ముడు పోతాయని భావించిన వ్యాపారవర్గాలు ఈ విధంగా బాణాసంచా కు జగన్ పేరు పెడితే, ముందు ముందు ఇంకా వేటికి జగన్ పేరు పెడతారో అన్నది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications