• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబాయి వై వి సుబ్బారెడ్డికి జగన్ గిఫ్ట్ అదిరిందిగా.. రాజ్య సభ ఎంపీగా అవకాశం

|

ఏపీ సీఎం జగన్ ఇప్పుడు తన వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో పడ్డారు. ఒకపక్క ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంతో పాటు పార్టీలోని నేతలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో పడ్డారు. ఒంగోలు మాజీ ఎంపీ, బాబాయి వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు.

మంత్రుల ప్రమాణ స్వీకారానికి స్వామీజీకి ఆహ్వానం ? అందుకేనా జగన్ విశాఖ పర్యటన

 ఇటీవల ఎన్నికల్లో వైవీ తన టికెట్ త్యాగం .. జగన్ పై వైవీ అసహనం

ఇటీవల ఎన్నికల్లో వైవీ తన టికెట్ త్యాగం .. జగన్ పై వైవీ అసహనం

2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైవీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా ఒంగోలు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ జగన్ ఆయనను పక్కన పెట్టి మరీ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎంపీ టికెట్‌ను ఖరారు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ సీటు ఇవ్వకపోవటంతో బాబాయి అబ్బాయికి మధ్య బాగానే చిచ్చు రగిలింది అని అందరూ భావించారు. . ఈ స్థానంలో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి జగన్ టిక్కెట్టు కేటాయించారు. దీంతో జగన్ బాబాయి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బాబాయికి గిఫ్ట్ గా రాజ్య సభ సీటు ఇవ్వాలనే ఆలోచనలో జగన్

బాబాయికి గిఫ్ట్ గా రాజ్య సభ సీటు ఇవ్వాలనే ఆలోచనలో జగన్

అయితే జగన్ బాబాయికి తరువాత పార్టీలో సరైన గౌరవం తప్పక ఇస్తానని మాట ఇచ్చారు. అయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికలకు ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి దూరంగా ఉన్నారు. కానీ జగన్ కు , పార్టీ శ్రేణులకు ఆయన సన్నిహితంగానే ఉన్నారు. టికెట్ ఇవ్వకపోవడంతో మొదట్లో అలకబూనిన వైవీ జగన్ హామీతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. తాజాగా ఆయనను రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్‌కు పంపాలని జగన్ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. ఇక ఏపీలో వైసీపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. గత ఎన్నికల్లో సిట్టింగ్ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికి త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఈ విషయమై జగన్ ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఎన్నికల్లో నిరాశ పరిచినా ఇప్పుడు బాబాయికి జగన్ అవకాశం

ఎన్నికల్లో నిరాశ పరిచినా ఇప్పుడు బాబాయికి జగన్ అవకాశం

నిన్నటి వరకు జగన్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మెన్ పదవి కట్టబెడతారని ప్రచారం జరిగింది. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మెన్ కు బదులుగా రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకొన్నారు.ఇక ఈ నేపధ్యంలో టీటీడీ చైర్మన్ గా ఎవరికి అవకాశం ఇస్తారా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ అని భావించిన వైవీ సుబ్బా రెడ్డిని అనూహ్యంగా రాజ్య సభ సభ్యుడిగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు జగన్. మొత్తానికి జగన్ ఎన్నికల సమయంలో బాబాయికి అవకాశం ఇవ్వకుండా నిరుత్సాహపరిచినా ఇప్పుడు మాత్రం బాబాయికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP chief Jagan Mohan Reddy has decided to allot Rajya Sabha seat to his uncle YV Subba Reddy. In the recent elections, Subba Reddy was snubbed by Jagan and the Ongole MP ticket was given away to Magunta Srinivasulu Reddy who joined YSRCP from TDP.Although Jagan assured that he would give Subba Reddy a prominent position in the party, he was upset. In the latter episodes Subba Reddy stayed away from Ongole election campaign but he continued to stay in touch with Jagan and party sources.After YSRCP's landslide victory, Subba Reddy flashed before the media and since then he constantly appeared at YS Jagan's residence in Tadepalli. Having given his word, Jagan has made up his mind to send Subba Reddy to the Upper House. An official announcement on behalf of YSR Congress party is expected later in the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more