వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన జగన్ సర్కార్ .. టీచర్ల అటెండెన్స్ యాప్ లో సడలింపులు; తాజా ఉత్తర్వులివే!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు హాజరు కోసం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది. మొదట తొమ్మిది గంటలకు ఒక నిమిషం లేటైనా ఆబ్సెంట్ గా పరిగణిస్తామని చెప్పి యాప్ ను సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు అటెండెన్స్ విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించడంతో 9 గంటలకు మరో పది నిమిషాల గ్రేస్ సమయాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అటెండెన్స్ కు ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో టీచర్ల ఆందోళన

అటెండెన్స్ కు ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో టీచర్ల ఆందోళన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ నుంచి ఆఫీసు సబార్డినేట్ వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ రికగ్నిషన్ యాప్ ను వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇక అందులో మొదటగా విద్యా శాఖలో ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చారు. విద్యాశాఖలో అన్ని పాఠశాలలలో ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్ గా పరిగణిస్తామని చెప్పడంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ తో దిగొచ్చిన సర్కార్.. సడలింపులు

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ తో దిగొచ్చిన సర్కార్.. సడలింపులు

యాప్ వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరికొన్ని సడలింపులు ఇస్తూ తిరిగి ఉత్తర్వులు జారీ చేసింది. 9 గంటల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉపాధ్యాయులకు మినహాయింపుని ఇచ్చి హాజరు వేసుకోవాల్సిందిగా సూచించింది. ఇక నెట్ వర్క్ సమస్యల కారణంగా యాప్ పనిచేయకపోతే ఆఫ్ లైన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

త్వరలో లీవ్ మాడ్యూల్ కూడా యాప్ లో అందుబాటులోకి

త్వరలో లీవ్ మాడ్యూల్ కూడా యాప్ లో అందుబాటులోకి


ఉపాధ్యాయులు పొరపాటున సెల్ ఫోన్ మరిచిపోయి స్కూలుకు వస్తే, నా సహచర ఉపాధ్యాయులు సెల్ ఫోన్ నుండి, లేదా ప్రధానోపాధ్యాయుడి సెల్ ఫోన్ నుండి హాజరు నమోదు చేసుకునే వీలు కల్పించింది. అలాగే డిప్యూటేషన్, శిక్షణ తదితర సమయాలలో వెళ్ళినప్పుడు ఆన్ డ్యూటీ లో ఉన్న వారి కోసం ఈనెల 25వ తేదీ నుంచి ప్రత్యేకంగా లీవ్ మాడ్యూల్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల లీవ్ వివరాలను కూడా యాప్ ద్వారా అప్డేట్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

English summary
The Jagan government came down due to the concern expressed by the teachers over the decision taken by the AP government regarding the attendance of teachers through face recognition app. With this, relaxations have been imposed in the teachers attendance app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X