వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్ల రామయ్యకు నోటీసులు ఇచ్చిన జగన్ సర్కార్ .. రాజీనామా చెయ్యండి .. లేదంటే ...

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ను జగన్ సర్కార్ టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో వర్ల రామయ్య ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్ ఆయనకు నోటీసులు పంపించింది. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయాలని, లేదంటే తొలగిస్తామని నోటీసులు జారీ చేసింది .

సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదంలో ఏడుగురు అధికారులకు నోటీసులు జారీసీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదంలో ఏడుగురు అధికారులకు నోటీసులు జారీ

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలావరకు నామినేటెడ్ పదవుల భర్తీ చేసింది . అంతకుముందు టిడిపి హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో వైసిపి ప్రభుత్వానికి ఆయా నామినేటెడ్ పదవుల భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. కానీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా నేటికీ కొనసాగుతున్న వర్ల రామయ్య ఒకపక్క ఆర్టీసీ విలీన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయక పోవడంతో ఆర్టీసీ చైర్మన్ గా తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది వైసిపి. ఆర్టీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నెల రోజులు టైమ్ ఇస్తూ నోటీసు జారీ చేసింది.

Jagan government Notices To Varla Ramaiah .. Resign .. Or else ...

టీడీపీ ప్రభుత్వ హయాంలో వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. అయితే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా ఆయన పదవిలోనే కొనసాగుతున్నారు. దీంతో నెలరోజుల్లోగా పదవినుంచి తప్పుకోవాలని నోటీసులు జారీ చేశారు వైసిపి ప్రభుత్వం. లేదంటే పదవి నుండి ప్రభుత్వం స్వయంగా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా ఉన్న సుధాకర్ యాదవ్ విషయంలోనూ ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.

టీడీపీ ప్రభుత్వ హయాంలో సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన పదవికి రాజీనామా చేయలేదు. దీంతో ఆయన్ను బలవంతంగా తప్పించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది . దీంతో తప్పని సరి పరిస్థితిలో సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు.

ఇప్పుడు వర్ల రామయ్యను కూడా అలాగే సాగనంపడానికి జగన్ ప్రభుత్వం తీవ్ర యత్నాలు చేస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు పలుమార్లు మీడియా ముఖంగా చెప్పినప్పటికీ వర్ల రామయ్య రాజీనామా చేయలేదు. దీంతో నెలరోజుల్లోగా స్వచ్ఛందంగా తప్పుకోవాలని శుక్రవారం సాయంత్రం వర్లకు జగన్ సర్కార్ నోటీసులు జారీచేసింది. లేకుంటే తామే తొలగిస్తామని ఒత్తిడి పెంచుతోంది.

English summary
Jagan's government targeted Varla Ramaiah, sent notices to him. In his current role as chairman of the APS RTC, he has issued notices of resignation or dismissal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X