జగన్ సర్కార్ కీలక నిర్ణయం - బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్.. ధర్మాన తొలి సంతకం..

ఏపీలో పాలనా సంస్కరణలను వేగవంతం చేస్తున్న జగన్ సర్కార్ ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అత్యంత అవసరమైన ఆదాయ ధృవపత్రాల జారీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. పేదలకు ఇప్పటివరకూ జారీ చేస్తున్న బియ్యం కార్డులనే ఆదాయ ధృవపత్రంగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం ఫైలుపై రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇవాళ సంతకం చేశారు.

Recommended Video

    Andhra Pradesh : బియ్యం కార్డులే ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు.. రెవెన్యూ శాఖ‌ ఉత్త‌ర్వులు!

    డిప్యూటీ సీఎం కమ్ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే కృష్ణదాస్ దీనికి ఆమోద ముద్ర వేశారు.ఆలాగే ఆదాయ ధృవపత్రం వ్యాలిడిటీ గడువును కూడా ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచారు. దీంతో ఏటా అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. బియ్యం కార్డును ఆదాయ ధృవపత్రంగా గుర్తించడం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

    jagan government to consider rice card as income certificate from now

    ఇకపై వారు ప్రతిసారీ ఆదాయ ధృవపత్రం కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుందని కృష్ణదాస్ వెల్లడించారు. ఇదే కోవలో దీర్ఘకాలంగా జనం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సత్వరం పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారానికి త్వరలో భూముల రీసర్వే చేపడతామన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+