ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు జగన్ సర్కార్ రెడీ .. సెప్టెంబర్ నుండి ఈకేవైసీ చేసిన వారికే రేషన్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం సిద్ధం అవుతోందా ? ఈకేవైసీ తప్పని సరి చేసిన ప్రభుత్వం కేవైసీ అప్డేట్ చేసుకోకుంటే రేషన్ నిలిపివేయనుందా? చాలా మంది అనర్హులు రేషన్ కార్డుల ద్వారా నిరుపేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను అందకుండా చేస్తున్న క్రమంలో ఈ కేవైసీ అప్డేట్ చేయాలని నిర్ణయం తీసుకుందా ? ఇక రాష్ట్రంపై పడే భారాన్ని తగ్గించాలని సర్కార్ భావిస్తోందా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

సెప్టెంబర్ నుండి ఈకేవైసీ చేయించుకుంటేనే రేషన్

సెప్టెంబర్ నుండి ఈకేవైసీ చేయించుకుంటేనే రేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. రేషన్ విషయంలో గత ప్రభుత్వాల హయాంలో బోగస్ లబ్దిదారులు ఉన్నారని తెలిసినా,వారిని తొలగించే సాహసం చెయ్యని పరిస్థితి. కానీ వైసీపీ ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి రేషన్ అందించి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తోంది సర్కార్. అయితే ఇందులోనూ బోగస్ లబ్ధిదారులు ఉండటంతో, వారి తొలగింపుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే రేషన్ తీసుకోవాలంటే కొత్తగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ కేవైసీ ని తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే రేషన్ లబ్ధిదారులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని, సెప్టెంబరు నెల నుండి ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే రేషన్ ఇస్తారని, అలా చేసుకోని వారికి రేషన్ ఆపేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

 ఏపీలో జగన్ సర్కార్ వచ్చాక ఇంటికే రేషన్ ..

ఏపీలో జగన్ సర్కార్ వచ్చాక ఇంటికే రేషన్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఇంటికే రేషన్ సరఫరా ను ప్రారంభించింది. అంతేకాదు ప్రజలకు నాణ్యమైన, సన్న బియ్యం ని అందించాలని కూడా నిర్ణయించింది. రేషన్ లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇంటికే రేషన్ సరుకులు అందుతున్నా , ఏదో ఒక సమస్య రేషన్ లబ్దిదారులను ఇబ్బంది పెడుతూనే ఉంది. గతంలో వేలిముద్రల సమస్య వారిని వేధించేది. వేలిముద్రలు పడని వారికి రేషన్ సరుకులు ఇవ్వని పరిస్థితి ఉండేది. అయితే రేషన్ లబ్ధిదారుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వేలిముద్రలు పడని వారికి నామినీ వేలిముద్రల ద్వారా గాని, లేదా ఐరిస్ యంత్రాల ద్వారా గానీ , వాలంటీర్ల వేలిముద్రల ద్వారా గాని లబ్ధిదారులను గుర్తించి వారికి రేషన్ సరఫరా చేయాలని నిర్ణయించి, అదే విధంగా వారికి రేషన్ అందిస్తున్నారు.

ఈ నెల 17 వ తారీఖు డెడ్ లైన్ .. లేదంటే కార్డుల తొలగింత

ఈ నెల 17 వ తారీఖు డెడ్ లైన్ .. లేదంటే కార్డుల తొలగింత

ఇక ప్రస్తుతం రేషన్ కార్డు తో ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు నిర్ణయించిన ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. సెప్టెంబర్ నెల నుండి ఈకేవైసీ అప్డేట్ చేసిన కార్డులకే రేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకోని వారు ఆధార్ కార్డు తో అనుసంధానం చేయించుకోవడం ద్వారా రేషన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ఈనెల 17వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న రేషన్ లబ్ధిదారులు అందరూ తమ తమ ఆధార్ కార్డులతో ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది. అలా చేసుకోని పక్షంలో వాటిని బోగస్ కార్డులుగా గుర్తించి తొలగించే ప్రక్రియ కు రంగం సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్.

ఇప్పటికే విలేజ్ వాలంటీర్ల ద్వారా ఈకేవైసీ అప్డేషన్

ఇప్పటికే విలేజ్ వాలంటీర్ల ద్వారా ఈకేవైసీ అప్డేషన్

రాష్ట్ర వ్యాప్తంగా 1, 48,56,590 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,31,84,543 మంది లబ్ధిదారులకు రేషన్ అందుతోంది. కేంద్ర ప్రభుత్వం కార్డులోని సభ్యులందరికీ ఈ కేవైసీ చేయించాలని చాలా కాలంగా రాష్ట్రాలకు సూచిస్తున్న క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ చేయించడానికి విలేజ్ వాలంటీర్ల ద్వారా ఈ కేవైసీ అప్డేషన్ ప్రారంభించింది. చాలా కాలం నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ భారీ సంఖ్యలోనే ఈ కేవైసీ నమోదు చేసుకోని వారు ఉండడంతో, వారందరికీ డెడ్లైన్ పెట్టింది. ఈనెల 17వ తేదీలోపు అందరూ ఈ కేవైసీ అప్డేట్ చేసుకోకుంటే అప్డేట్ చేసుకోని వారి రేషన్ నిలిపివేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

 సంపన్న వర్గాలు కూడా రేషన్ కార్డుల్లో

సంపన్న వర్గాలు కూడా రేషన్ కార్డుల్లో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని అంచనా ఉంటే అందులో దాదాపు 4.31 కోట్ల మంది రేషన్ కార్డు లో ఉన్నారు. ఇక ఈ రేషన్ కార్డులలో అర్హత లేని వారు కూడా ఉన్నట్లుగా అనుమానాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, బాగా ఆస్తులు ఉన్నవారు, పన్నులు చెల్లించే వారు, వివిధ వ్యాపారాలు చేసేవారు, సంపన్న వర్గాల వారు రేషన్ కార్డులో ఉన్నట్లుగా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ అనర్హుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu
    కేంద్రం కూడా ఈకేవైసీ చెయ్యాలని ఆదేశం .. రాష్ట్రంపై పడే భారం తగ్గించే ప్లాన్

    కేంద్రం కూడా ఈకేవైసీ చెయ్యాలని ఆదేశం .. రాష్ట్రంపై పడే భారం తగ్గించే ప్లాన్

    కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేయడంతో అందులో భాగంగానే అంటూ రంగంలోకి దిగింది. బోగస్ కార్డుల ఏరివేత ద్వారా చాలావరకు రాష్ట్రంపై పడే భారాన్ని తగ్గించే వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల నుండి ఈ కేవైసీ చేయించుకోని వారికి రేషన్ ఇవ్వమని హెచ్చరిస్తుంది. నిజమైన లబ్ధిదారులు ఈ కేవైసీ చేయించుకుంటారని, ఈ కేవైసీ చేయించుకోని వారిలో చాలా మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరించనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+