Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పట్టు బిగిస్తున్న జగన్ సర్కార్ .. ఎన్జీటీ విచారణతో తెలంగాణాకు చుక్కలు !!

పట్టు పట్టరాదు.. పట్టి విడువరాదు.. పట్టనేని బిగియ పట్టవలయు అని భావించారేమో గానీ ఏపీ సర్కార్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను వదలడం లేదు. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మరోమారు ఏపీ ప్రభుత్వం తమ వాదన వినిపించింది. జగన్ మార్క్ షాక్ కేసీఆర్ కు ఇచ్చే పనిలో పడింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో సమయం మించి పోయిన తర్వాత తాము పిటిషన్ దాఖలు చేయలేదని, ఇప్పటికైనా ప్రాజెక్ట్ పనులు నిలిపివేయవచ్చని ఏపీ ప్రభుత్వం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు స్పష్టం చేసింది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కొనసాగుతున్న విచారణ

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కొనసాగుతున్న విచారణ

పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే రైతుతో పాటు మరికొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు . జాతీయ హరిత ట్రిబ్యునల్ న్యాయ సభ్యుడు జస్టిస్ కె రామకృష్ణ సభ్య నిపుణుడు కే సత్య గోపాల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున వాదన విన్నది. అక్టోబర్ 6 బుధవారం కూడా ఈ కేసుపై విచారణ కొనసాగనున్న నేపథ్యంలో ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా చోటుచేసుకుంది.

 సమయం మించిన తర్వాత ఏపీ పిటీషన్ దాఖలు చెయ్యలేదన్న ఏపీ సర్కార్

సమయం మించిన తర్వాత ఏపీ పిటీషన్ దాఖలు చెయ్యలేదన్న ఏపీ సర్కార్

ఇదిలా ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల కొనసాగింపు నిరంతరం జరుగుతున్న నేపథ్యంలో సమయం మించిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారని చెప్పడం సరికాదని ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో తాగునీటి ప్రాజెక్టుగా ప్రకటించి పనులు చేపట్టి రెండవ దశలో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుగా బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చిందని, కృష్ణా బోర్డు నివేదికలో సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొందని జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు తెలంగాణా సమర్పించిన నివేదికపై అభ్యంతరాలను వ్యక్తం చేసిందని పేర్కొంటూ ఈ విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు ప్రస్తావించారు. అంతకు ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 పాలమూరు రంగారెడ్డి పనుల వేగం పెంచిన తెలంగాణా

పాలమూరు రంగారెడ్డి పనుల వేగం పెంచిన తెలంగాణా

ఇదిలా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా కొనసాగేలా చేయాలని పనులను స్పీడ్ అప్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి కలెక్టరేట్ లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ లకు నీళ్లు ఇచ్చే విధంగా పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి కాలువల పైన ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

మరోపక్క ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన సందర్భంలో ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి తో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత అవసరమైన ప్రాజెక్ట్ అని, పాలమూరు పూర్తిగా కరువు కరువు పీడిత ప్రాంతమని, సాగునీరు తాగునీరు కొరతతో అల్లాడుతున్న ప్రాంతమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను కొనసాగించడానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ జి టి లో బలంగా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై పట్టు బిగించేందుకు కెసిఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణా ప్రభుత్వానికి షాక్ ఇచ్చే నివేదిక ఇచ్చిన సంయుక్త కమిటీ

తెలంగాణా ప్రభుత్వానికి షాక్ ఇచ్చే నివేదిక ఇచ్చిన సంయుక్త కమిటీ


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించిన సంయుక్త కమిటీ తెలంగాణా నిబంధనలు ఉల్లంఘించిందని, తాగునీటి ప్రాజెక్టు అని చెప్పి సాగునీటి ప్రాజెక్టుగా పనులను చేస్తుందని పేర్కొంది, నిబంధనలను ఉల్లంఘించినందుకు తెలంగాణాకు 3 కోట్ల 80 లక్షల రూపాయల జరిమానా వెయ్యాలని సిఫార్సు చేస్తూ సంయక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక అందజేసింది. ఆ నివేదిక నిండా తెలంగాణా ఉల్లంఘనలను ప్రస్తావించింది. తెలంగాణా చేపట్టిన నిర్మాణాలు, వాటి వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాన్ని కూడా అంచనా వేసింది.

Recommended Video

    అభివృద్దిలో తెలంగాణ దూసుకెళ్తోందన్న మంత్రి కేటీఆర్!! || Oneindia Telugu
     పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీలో పట్టు బిగిస్తున్న ఏపీ.. తెలంగాణా ఉక్కిరిబిక్కిరి

    పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీలో పట్టు బిగిస్తున్న ఏపీ.. తెలంగాణా ఉక్కిరిబిక్కిరి


    ఏది ఏమైనా తాజా పరిణామాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రభుత్వ తీరు, ఇటీవల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై ఎన్జీటీకి సంయుక్త కమిటీ ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్ లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని, తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని తెలంగాణాకు వ్యతిరేకంగా అనేక అంశాలు ప్రస్తావించటం తెలంగాణా సర్కార్ ను ఇబ్బంది పెడుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్జీటీ విచారణలో పాలమూరు-రంగారెడ్డి పై తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా నిరూపించే ప్రయత్నం చేస్తోంది ఏపీ. మరోవైపు సంయుక్త కమిటీ నివేదిక కూడా అదే స్పష్టం చేయడంతో అక్టోబర్ 6 బుధవారం జరగనున్న విచారణలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+