వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు తీర్పిచ్చినా మూడు రాజధానులపై వెనక్కుతగ్గని జగన్ సర్కార్; మంత్రుల వ్యాఖ్యల ఆంతర్యం అదేనా?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు తీర్పు జగన్ సర్కార్ కు చెంపపెట్టు అని, ఇప్పటికైనా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్ష పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు తీర్పిచ్చినా మూడు రాజధానులపై వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు.

Recommended Video

AP 3 Capitals పై High Court సంచలనం రాజధానిగా Amaravati| AP CM Jagan | Oneindia Telugu
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తాం.. సుప్రీం కు వెళ్తాం : సుచరిత

మూడు రాజధానులను ఏర్పాటు చేస్తాం.. సుప్రీం కు వెళ్తాం : సుచరిత

తాజాగా ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తాము మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాము సుప్రీంకోర్టుకు వెళతామని, హైకోర్టు తీర్పును సుప్రీం లో సవాల్ చేస్తామని మేకతోటి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని ఆమె స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి కాంక్షిస్తున్నారని మేకతోటి సుచరిత స్పష్టంచేశారు. రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం రాష్ట్రం పరిధిలోనిదని కేంద్రం చెప్పిందని సుచరిత పేర్కొన్నారు.

శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది: హోం మంత్రి సుచరిత

శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది: హోం మంత్రి సుచరిత


రాజధాని పై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పిందని పేర్కొన్న ఆమె కోర్టు అభిప్రాయం పై పెదవి విరిచారు. రాజధాని పై శాసన నిర్ణయాధికారం లేదని చెప్పే వారికి అవగాహన లేదని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని, తాము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని మేకతోటి సుచరిత వెల్లడించారు. ఇక ఇప్పటికే మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే.

 పరిపాలన వికేంద్రీకరణ జగన్ సర్కార్ విధానం: బొత్సా

పరిపాలన వికేంద్రీకరణ జగన్ సర్కార్ విధానం: బొత్సా

ప్రజలకు పరిపాలనను దగ్గరికి తీసుకు రావడానికే తమ ప్రభుత్వం పని చేస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఆయన వెల్లడించారు. ఇక హైకోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుంది: వెల్లంపల్ల్లి శ్రీనివాస్

మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుంది: వెల్లంపల్ల్లి శ్రీనివాస్

అంతేకాదు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం తమ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతుంది అని తేల్చి చెప్పారు. హైకోర్టు తీర్పు విషయంలో తాము ఆశ్చర్యానికి గురి కాలేదని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి కి అన్యాయం చేసింది, రాజధాని రైతులు మోసం చేసింది చంద్రబాబేనని వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. రాజధాని అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానుల నిర్ణయం అని పేర్కొన్నారు.

 తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు జగన్ సర్కార్ తీరు

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు జగన్ సర్కార్ తీరు


ఏపీ హైకోర్టు రాజధాని అమరావతిని అభివృద్ధి చెయ్యాలని, ఆపేసిన భవనాల నిర్మాణం చెయ్యాలని, రాజధాని రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి మూడు నెలల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం అభివృద్ధి జరగాలని పేర్కొంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ పై కోర్టు తీర్పు నేపధ్యంలో కూడా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటం వైసీపీ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. తాజా మంత్రుల ప్రకటనలు కోర్టు తీర్పుతో కూడా జగన్ తన మొండి వైఖరి మార్చుకోలేదన్న భావనకు ఊతం ఇస్తుంది.

English summary
Jagan govt, who will not back down on the three capitals despite the High Court verdict. This is the gist of the ministers remarks. hot debate in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X