'రూ.500, రూ.1000 నోట్ల ఎఫెక్ట్‌తో జగన్‌కు చలిజ్వరం, నేలమాళిగలో ధనం'

అమరావతి: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చలి జ్వరం వచ్చిందని తెలుగుదేశం ాపర్టీ సీనియర్ నేత వర్ల రామయ్య సోమవారం నాడు ఎద్దేవా చేశారు. నేలమాళిగల్లో దాచిన నల్లధనం ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారన్నారు.

తన ఇంటిలోని నేలమాళిగలో దాచిన డబ్బును ఎలా బయటకు తీయాలో తెలియగా ఆయన దిగాలుగా ఉన్నారన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన మాట్లాడుతూ... ఇప్పుడు ఇబ్బందులు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందన్నారు. దేశ ఆఱ్థిక ప్రగతికి నోట్ల రద్దు చర్య దోహదం చేస్తుందన్నారు.

కాగా, మూడు రోజుల క్రితం మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కూడా జగన్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భూగర్భంలో దాచుకున్న తన నల్ల డబ్బు ఏమవుతుందోనని నల్ల కుబేరుడు, వైసిపి నేత జగన్ తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరాడని ఎద్దేవా చేశారు.

Jagan has black money: Telugudesam

పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకోని జగన్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

పదహారు నెలల పాటు జైలులో ఉన్న జగన్‌ ఆస్తులను రూ. 43 వేల కోట్లను ఈడీ జప్తు చేస్తే సిగ్గు లేకుండా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రాభివృద్దికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తనను, టిడిపి నేతలను వారి సాక్షి ఛానల్‌, పత్రికల్లో తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆ పార్టీ నేతలకు కూడా అదే పని అన్నారు. ఆ పార్టీ నేతలతో తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి దుయ్యబట్టారు.

ముద్రగడపై చినరాజప్ప విమర్శలు

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర విషయంలో ప్రభుత్వం, పోలీసు శాఖ నిబంధనలకు అనుగుణంగా తమ పని తాము చేస్తుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వేరుగా తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు శాఖకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.

కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే ఆ కమిషన్‌ జిల్లాల్లో పర్యటిస్తోందని చెప్పారు. అదే సమయంలో సర్వే నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+