చంద్రబాబు ఇలాకా నుండి జగన్: స్పీకర్‌ను జడ్జి సూచన
న్యూఢిల్లీ/హైదరాబాద్: తాను త్వరలో తిరిగి ఓదార్పు యాత్ర చేపడతానని, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సమైక్య శంఖారావం పూరిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఎక్కువ మాట్లాడడానికి సమయం సరిపోవడం లేదని, అందువల్ల మళ్లీ వస్తానని చెప్పారు.
వైయస్ మరణం తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఓదారుస్తానని చెప్పారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మళ్లీ ఓదార్పు యాత్ర త్వరలో చేపడతానని ప్రకటించారు. తాను మాజీ మంత్రి పిల్లి సుభాశ్ చంద్రబోసు కుమారుడి వివాహ కార్యక్రమం కోసం ఆకస్మికంగా వచ్చానని, అందువల్ల మాట్లాడడానికి ఎక్కువ సమయం లేదన్నారు. గతంలో జక్కంపూడి ఇంట్లో వివాహ జరిగినప్పుడు జైలులో ఉండటం వల్ల రాలేకపోయినట్లు చెప్పారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా లోక్‌సభ సభ్యత్వానికి తాము చేసిన రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై వాదనలను ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 17న విననుంది.

అయితే, రాజీనామాల ఆమోదం విషయంపై లోక్‌సభ స్పీకర్‌నే కలవాలని న్యాయమూర్తి జస్టిస్ వికె జైన్ సూచించారు. ఇందుకు జగన్ తరపు న్యాయవాది అంగీకరించారు. ప్రస్తుతం జగన్ రాష్ట్రం విడిచి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఈ విషయంపై సంబంధిత కోర్టు నుంచే అనుమతి తీసుకోవాలని కూడా న్యాయమూర్తి చెప్పారు.
మరోవైపు, అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైయస్ జగన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications