సాక్షి ప్రచారం, అదీ జగన్: యనమల, వంగవీటి కంటతడి
హైదరాబాద్/విజయవాడ: తమ పార్టీ కాంగ్రెసు నేతలకు వల విసురుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన పార్టీ ప్రచారం చేయడం విడ్డూరమని, అది జగన్ నైజానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు గురువారం మండిపడ్డారు.
జగన్ ధన దాహానికి పారిశ్రామికవేత్తలు, అధికారులు, రాజకీయ నాయకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు, అసెంబ్లీ సీట్లను డబ్బులకు అమ్ముకుంటోందని ఆరోపించారు. జగన్‌కు నియంత హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందన్నారు.

వంగవీటి రాధా కంట నీరు
మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ కంటతడి పెట్టారు. వంగవీటి రంగా 25వ వర్దంతి సందర్భంగా గురువారం ఉదయం రంగా విగ్రహానికి రాధ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయాలను సాంధించేందుకు ప్రజా సమస్యలపై పోరాడుతానన్నారు. రంగా మిత్ర మండలికి అండగా నిలిచిన వారందరికీ వంగవీటి రాధ కంటతడి పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.
అర్థం కావట్లేదు: నారాయణ
జంపింగులతో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేరుగా అన్నారు. ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకునేందుకు నేతలు మెడలో బోర్డులు వేసుకోవాలేమోనని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications