జగన్ సర్కార్ నిర్ణయం మిస్ ఫైర్- ఆస్తుల జప్తుపై విమర్శల వెల్లువ-డైలీ ఫైనాన్స్ వ్యాపారుల్లా..

ఏపీలో పన్ను వసూళ్ల రచ్చ నానాటికీ పెరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ఆస్తిపన్ను, కుళాయి పన్నుతో పాటు చెత్తపన్ను కూడా విధించి దాన్ని ఎలాగైనా వసూలు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో వారు క్షేత్రస్ధాయిలో పన్ను వసూళ్ల కోసం ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో పన్ను చెల్లించకపోతే మీ ఆస్తులు ఎత్తుకెళ్తామంటూ కాకినాడ కార్పోరేషన్ రంగంలోకి దింపిన వాహనాలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రభుత్వం పన్ను వసూళ్లను డైలీ ఫైనాన్స్ వ్యాపారంలా మార్చడమేంటని పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించారు.

పన్ను వసూళ్ల రచ్చ

పన్ను వసూళ్ల రచ్చ

ఏపీలో ఇప్పటికే వసూలు చేస్తున్న ఆస్తిపన్ను, కుళాయిపన్నుకు తోడు తాజాగా చెత్తపన్నును కూడా ప్రవేశపెట్టింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే కట్టిస్తున్న పన్నుల్లోనే ఇన్నాళ్లు చెత్త తీసుకెళ్లడం కూడా భాగంగా ఉండేదని,ఇప్పుడు కొత్తగా చెత్త పన్ను ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీనిపై విపక్షాలు, ప్రజాసంఘాలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లింది. ఇప్పుడు ప్రజలు నేరుగా ఈ పన్నుల కట్టేందుకు ముందుకు రాకపోవడంతో సమస్య మొదలైంది. దీంతో అధికారులు బెదిరింపులకు దిగడంతో సమస్య ముదురుతోంది.

13 రోజుల్లో వెయ్యికోట్ల చెత్తపన్ను టార్గెట్

13 రోజుల్లో వెయ్యికోట్ల చెత్తపన్ను టార్గెట్

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఇంటింటికీ చెత్త పన్ను వసూళ్లను ప్రారంభించిన ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. చెత్తపన్ను చెల్లించేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారుల సాయంతో చెత్త పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఇందులో భాగంగా 13 రోజుల్లో వెయ్యి కోట్లు వసూలు చేయాలని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాతీలకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. దీంతో చెత్త పన్ను వసూళ్లు ఉద్ధృతం చేసేందుకు ఆయా స్ధానిక సంస్ధలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి.

కాకినాడలో ఆస్తుల జప్తు వాహనాలు

కాకినాడలో ఆస్తుల జప్తు వాహనాలు

చెత్త పన్ను వసూళ్లకు జనం ముందుకు రాకపోవడంతో వారి ఆస్తుల్ని జప్తు చేస్తామంటూ స్ధానిక సంస్ధలు బెదిరింపులకు దిగుతున్నాయి. ఇందుకోసం కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఏకంగా చెత్త పన్ను కట్టకపోతే ఆస్తుల్ని జప్తు చేస్తామంటూ హెచ్చరిస్తూ బ్యానర్లు పెట్టిన వాహనాలను రంగంలోకి దింపింది.

ఆస్తిపన్ను, కుళాయిపన్ను, చెత్తపన్ను ఇలా పన్నులు చెల్లించకపోతే మీ ఆస్తులు జప్తు చేసే వాహనాలంటూ వాటిపై బ్యానర్లు పెట్టించి నగరంలో తిప్పుతోంది. దీంతో జనం అలాగైనా పన్నులు కడతారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం కూడా ఎదురుతన్నేలా ఉంది.

 డైలీ ఫైనాన్స్ వ్యాపారంలా ఉందని పవన్ ఎద్దేవా

డైలీ ఫైనాన్స్ వ్యాపారంలా ఉందని పవన్ ఎద్దేవా

పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామంటూ కాకినాడ కార్పోరేషన్ వాహనాలపై పెట్టిన బ్యానర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్బుబట్టారు. ఇది డైలీ ఫైనాన్స్ వ్యాపారుల ఆలోచనలా ఉందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఊర్లలో వడ్డీకి డబ్బులు ఇచ్చి వాటిని కట్టకపోతే ఫైనాన్స్ వ్యాపారులు వచ్చి సదరు సామాన్లను తీసుకెళ్లి పోవడం సాధారణంగా జరుగుతుంటుంది. దీన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్.. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకెళ్లిపోతాననడం దేన్ని సూచిస్తోందంటూ నిన్న ట్వీట్ చేశారు.

ఆస్తుల జప్తుపై విమర్శల వెల్లువ

ఆస్తుల జప్తుపై విమర్శల వెల్లువ

రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు ప్రభుత్వం చెత్తపన్ను సహా అన్ని పన్నులకు అధికారులకు టార్గెట్లు పెడుతోంది. వాటిని అందుకోవడంలో విఫలమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. దీంతో భయపడి వారు క్షేత్రస్దాయిలో వడ్డీ వ్యాపారుల్లో జనంపై బెదిరింపులకు దిగుతున్నారు.

ఇప్పుడు ఈ బెదిరింపుల పర్వం ముదిరి సామాన్లు పట్టుకెళ్లిపోతాం అనే వరకూ వచ్చింది. దీంతో ఆస్తుల జప్తు ఆలోచనపై జనంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో కాకినాడ కార్పోరేషన్ వెనక్కి తగ్గింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఈ బెదిరింపులు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+