సర్పంచ్ లకు జగన్ ఉగాది షాక్- మళ్లీ ఖాతాలు ఖాళీ-ఈసారి దేనికి జమో తెలియక గగ్గోలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు కొత్తగా నిధులు కేటాయించకపోగా.. ఆర్ధిక సంఘాలు ఇస్తున్న నిధుల్ని సైతం ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లించేస్తోంది. తమకున్న విచక్షణాధికారంతో చేస్తున్న ఈ మళ్లింపులు పంచాయతీలకు, వాటి సర్పంచ్ లకు మాత్రం భారీ షాకులిస్తున్నాయి. అసలే అరకొర నిధులతో అభివృద్ధికి దూరమవుతున్న పంచాయతీలకు ఇదే కోవలో ప్రభుత్వం ఉగాది వేళ మరో షాకిచ్చింది.

పంచాయతీల నిధుల మళ్లింపు

పంచాయతీల నిధుల మళ్లింపు

ఏపీలో గ్రామ పంచాయతీల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఇప్పటికే వాటికి సమాంతరంగా వెలిసిన గ్రామ సచివాలయాలకే అధికారులు, నిధులు అన్నీ దఖలు పడుతుండటంతో కునారిల్లుతున్న పంచాయతీరాజ్ వ్యవస్ధకు నిధుల మళ్లింపు రూపంలో భారీ షాకులు తగులుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని రోజూ అప్పులతో కాలం గడుపుతున్న తరుణంలో పంచాయతీల వద్ద నున్న ఆర్ధిక సంఘం నిధులను కూడా లాక్కుంటూ ప్రభుత్వం వారికి రోజుకో షాకిస్తోంది. దీంతో ఇక పంచాయతీ వ్యవస్ధ ముందుకుసాగేదెలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇలా పంచాయతీ ఖాతాల్లోనూ నిధుల్ని మళ్లించిన ప్రభుత్వ తీరుపై సర్పంచ్ లు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.

సర్పంచ్ లకు ఉగాది షాక్

సర్పంచ్ లకు ఉగాది షాక్

తాజాగా మరోసారి వైసీపీ సర్కార్ పంచాయతీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు మళ్లించడంతో ఉగాది నాడు సర్పంచ్ లకు భారీ షాక్ తగిలింది. జీరోగా మారిన పంచాయతీల ఖాతాలు చూసుకుంటే సర్పంచ్ లు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఇలా తమ నిధుల్ని లాగేసుకున్న ప్రభుత్వం మరోసారి ఇలా నిధులు మళ్లించుకోవడంపై సర్పంచ్ లు మండిపడుతున్నారు. అయినా ఏమీ చేయలేన పరిస్ధితి. దీంతో పండుగ వేళ కూడా ప్రభుత్వం ఇలా షాకిచ్చిందేంటని సర్పంచ్ లు చెవులు కొరుక్కుంటున్నారు.

 అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఈ ఏడాది ఆర్ధిక సంఘం నుంచి పంచాయతీలకు కేటాయించిన నిధుల్ని విద్యుత్ బిల్లుల బకాయిల కింద ప్రభుత్వం తీసేసుకుంది. దీంతో లబోదిబోమంటున్న పంచాయతీలపై ఇప్పుడు మరో పిడుగు పడింది. ఆస్తిపన్ను, ఇతరత్రా రుసుముల కింద పంచాయతీల ఖాతాల్లో కాస్తో కూస్తో నిధులు చేరడంతో వాటిపై కన్నేసిన ప్రభుత్వం తాజాగా నిన్న వాటిని తమ ఖాతాల్లోకి మళ్లించేసుకుంది. సాధారణగా నిధులుగా పేర్కొనే వీటితోనే తాగు నీటి సరఫరా, బోర్ల మరమ్మత్తులు, పైపులైన్ల మరమ్మత్తులు, ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ కాస్త నిధుల్నీ తీసేసుకోవడంతో సర్పంచ్ లు లబోదిబోమంటున్నారు.

 బిల్లులు చెల్లించకపోగా మళ్లింపులతో షాకులు?

బిల్లులు చెల్లించకపోగా మళ్లింపులతో షాకులు?

ఇప్పటికే పంచాయతీల్లో చేపట్టిన పలు పనులకు సంబంధించి ప్రభుత్వం వివిధ బిల్లులు చెల్లించాల్సి ఉంది. పంచాయతీలను సీఎఫ్ఎంఎస్ కు అనుసంధానం చేశాక ప్రతీ బిల్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలా అప్ లోడ్ చేసిన బిల్లుల్ని మాత్రం ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు.

కానీ తాము వసూలు చేసుకున్న పన్నుల నిధుల్ని మాత్రం ప్రభుత్వం ఎంచక్కా రాజమార్గంలో తీసేసుకుంటోంది. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ లో పంచాయతీలకు సంబంధించిన కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయకపోగా.. తమ నిధుల్ని కూడా లాగేసుకుంటే పంచాయతీలను ఎలా నడపాలంటూ సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+