ఏపీ తాజా, మాజీ మంత్రుల మానవత్వం-వైసీపీ నేత పాడెమోసిన జోగిరమేష్, పేర్నినాని
ఏపీలో వైసీపీ మంత్రి జోగి రమేష్ తో పాటు మాజీ మంత్రి పేర్నినాని మానవత్వం చూపారు. వైసీపీలో తమతో కలిసి పనిచేసిన కీలక నేత చనిపోయారని తెలియగానే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు దగ్గరుండి మరీ పాడె మోశారు. అంత్యక్రియల్లో పాల్గొని ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కృష్ణాజిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కృష్ణాజిల్లా గూడూరు మండల సర్పంచ్ ల అధ్యక్షుడు బండి రమేష్ అంతిమ యాత్ర మంత్రి జోగి రమేష్ తో పాటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. మంత్రి హోదాను కూడా పక్కనబెట్టి తమతో కలిసి ప్రయ్ాణించిన పార్టీ నేత అంతిమయాత్రలో పాల్గొన్నారు. భేషజాలు పక్కనబెట్టి అంతిమసంస్కారాలు నిర్వహించారు. మిగతా కార్యకర్తలతో కలిసి దహన సంస్కారాలు అయ్యే వరకూ అక్కడే ఉన్నారు. తద్వారా మంత్రి హోదా కంటే మానవత్వమే మిన్న అని నిరూపించారు.

జోగి రమేష్ అయితే మంత్రి అయిన రెండవ రోజే గూడురు సర్పంచ్ బండి రమేష్ అంతిమ యాత్ర లో పాల్గొని ప్రజల మనసును గెలుచుకున్నారు. గుండెపోటు తో హఠాన్మరణం పాలైన గూడూరు మండల సర్పంచ్ ల అధ్యక్షుడు బండి రమేష్ అంతిమ యాత్ర లో మాజీ మంత్రి పేర్ని నాని తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి జోగి రమేష్ పాల్గొన్న అంతిమ యాత్ర ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మంత్రి జోగి రమేష్ చూపిన మానవత్వం పై నియోజకర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications