Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో జీవోల రగడ : జగన్ ద్వంద్వ వైఖరి.. ఆ వీడియోతో సోషల్ మీడియాలో రచ్చ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దుమారంగా మారింది. ప్రభుత్వ వెబ్ సైట్ లలో జీవోలను పెట్టొద్దు అంటూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాన్ఫిడెన్షియల్ జీవోలను ఇస్తోందని అప్పట్లో విమర్శలు గుప్పించి, ఏకంగా వెబ్సైట్ లో ఉంచే విధానానికి స్వస్తి పలకడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా రచ్చ కొనసాగుతుంది.

పారదర్శకత, విశ్వసనీయత అంటే ఇదేనా ? సోషల్ మీడియాలో చర్చ

పారదర్శకత, విశ్వసనీయత అంటే ఇదేనా ? సోషల్ మీడియాలో చర్చ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారంటూ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. విశ్వసనీయత, పారదర్శకత అంటే ఖాళీ జీవోలు రహస్యంగా ఇవ్వడమే అనుకుంటా అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ నిర్ణయంపై విమర్శలు వెల్లువగా మారాయి. రహస్య జీవోలు, ఖాళీ జీవోలు, కనిపించని జీవోలు ఇదేనా విశ్వసనీయత అంటూ తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది.

 వాసిరెడ్డి పద్మ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్

వాసిరెడ్డి పద్మ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీఅధికార ప్రతినిధి హోదాలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో వాసిరెడ్డి పద్మ కాన్ఫిడెన్షియల్ జీవోలపై మండిపడ్డారు. చంద్రబాబు కాన్ఫిడెన్షియల్ జీవోలపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇలాంటిది ఎక్కడైనా జరిగిందా ? పాలనాపరమైన ప్రతి అంశం ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలిసేలా సమాచార హక్కు చట్టం చేసుకున్నాం. ప్రజాస్వామ్యానికి మనం ఇచ్చిన గౌరవం అది అంటూ పేర్కొన్నారు.

 అప్పట్లో వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు ప్రశ్నిస్తున్న నెటిజన్లు

అప్పట్లో వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు ప్రశ్నిస్తున్న నెటిజన్లు

కానీ ఈ ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తెలియని ఇవ్వడం లేదంటే వాటిని చీకట్లో ఉంచుతుంది అంటే పాలనను ఎక్కడకు తీసుకు పోతుంది అంటూ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ సొంతానికి జీవోలు తీసుకొని ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచుకోవడం లో మతలబేంటి అని ప్రశ్నించారు. ఆ జీవోలను చీకట్లో ఉంచడానికి కారణమేమిటని నిలదీశారు. అందులో ఏ మనీలాండరింగ్, ఏ అక్రమ లావాదేవీల విషయాలు ఉన్నాయో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను ఎందుకు చీకటి రాజ్యం లోకి నెడుతున్నారు అంటూ అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిప్పులు చెరిగారు . ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేస్తూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ మనీలాండరింగ్, ఏ అక్రమ లావాదేవీలకు జీవోలను కనిపించకుండా నిలుపుదల చేస్తున్నారు అని నిలదీస్తున్నారు.

పారదర్శకతకే మొదటి ప్రాధాన్యత అని చెప్పిన జగన్ .. ఇప్పుడు ఎందుకిలా ?

పారదర్శకతకే మొదటి ప్రాధాన్యత అని చెప్పిన జగన్ .. ఇప్పుడు ఎందుకిలా ?

ఇక మొదటి నుంచీ ప్రతి అడుగులోనూ పారదర్శకత కనిపించాలని, ప్రభుత్వ ఇంత బాగా పని చేస్తుందని దేశం మొత్తం మనవైపు చూడాలని, మన విధానాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సైతం అనుసరించేలా ఉండాలని, అవినీతి అన్న మాట లేకుండా చేయాలని పాలనా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కానీ ప్రస్తుతం పారదర్శకత లేకుండా ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులను ఆన్లైన్ లో పెట్టొద్దు అంటూ, ప్రభుత్వ ఉత్తర్వులు ఆఫ్లైన్లో అధికారుల మధ్యనే ఉండాలంటూ పేర్కొనడంపై రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలలో సైతం విముఖత వ్యక్తమవుతుంది.

అప్పుడు టీడీపీపై అలా .. ఇప్పుడు టీడీపీని మించి అనూహ్య నిర్ణయాలు

అప్పుడు టీడీపీపై అలా .. ఇప్పుడు టీడీపీని మించి అనూహ్య నిర్ణయాలు

పారదర్శకంగా జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరంపై అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువగా మారాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో కాన్ఫిడెన్షియల్ జీవోలపై రచ్చ చేసిన వైసిపి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్షియల్ జీవోల విధానాన్ని కొనసాగించింది. ఇంకో అడుగు ముందుకేసి బ్లాంక్ జీవోలను జారీ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా జీవోలు కనిపించకుండా ఆఫ్ లైన్ లోనే జీవోలను ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది.

 జీవోలను కనిపించకుండా చెయ్యటం చట్ట విరుద్ధం అంటున్న న్యాయ నిపుణులు

జీవోలను కనిపించకుండా చెయ్యటం చట్ట విరుద్ధం అంటున్న న్యాయ నిపుణులు

దీనిని టిడిపి, బిజెపి తదితర ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జీవోలు బయటకు రాకుండా ఉండడం అక్రమాలకు, అవినీతికి మూలం గా మారతాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే జీవోలను వెల్లడించక పోవడం చట్టవిరుద్ధమని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డుల వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉందని, జీవోలు కూడా ప్రభుత్వ రికార్డుల పరిధిలోకి వస్తాయని కాబట్టి ఎవిడెన్స్ చట్టం సమాచార హక్కు చట్టం కింద వీటిని వెల్లడించాల్సిన అవసరం ఉందంటూ న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు .

 తెలంగాణాలో కూడా చాలా జీవోలు రహస్యంగానే .. కోర్టుల్లో పిటీషన్లు

తెలంగాణాలో కూడా చాలా జీవోలు రహస్యంగానే .. కోర్టుల్లో పిటీషన్లు

తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వ జీవోలను వెల్లడించక పోవడంపై ఇప్పటికే అనేక మార్లు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. 2016లో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ప్రభుత్వ జీవోల వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇక 2019లో సైతం అన్ని జీవోలను వెల్లడించలేదని బీజేపీ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా అనుసరించాలని భావిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ వర్గాలతో పాటుగా, విభిన్న వర్గాల ప్రజలు తప్పుబడుతున్నారు.

మ్యానువల్ విధానం తీసుకురావటం తిరోగమనమేనా ?

మ్యానువల్ విధానం తీసుకురావటం తిరోగమనమేనా ?

2005 వరకు ఉన్న ఏపీ సచివాలయ మ్యానువల్ రికార్డుల విధానాన్ని తిరిగి తీసుకు రావడాన్ని తిరోగమన చర్యగా పేర్కొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువగా మారుతున్నా అవి పట్టనట్టు ఏపీ సర్కార్ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి మూడు రికార్డ్ బుక్స్ ఏర్పాటు చేసుకోవాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న జీవోల రగడ ముందు ముందు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+