వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టినరోజే అబద్ధాలా- భూముల సర్వే కేంద్ర పథకం-జగన్‌పై బీజేపీ నేత విష్ణు విసుర్లు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వం చేపట్టిన భూముల సర్వే విషయంలో జగన్ సర్కారు తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన భూముల సర్వేను తమదిగా చెప్పుకుంటూ జగన్ మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఏపీలో ప్రభుత్వాలు ఇదే వైఖరి అవలంబించాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదే క్రమంలో ఏపీలో ప్రభుత్వం చేపట్టిన భూముల సర్వేపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం పథకం'స్వామిత్వ'ప్రవేశపెడితే
జగన్ గారు...!మీ ప్రభుత్వం పేరుమార్చి "వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష"ప్రారంభోత్సవం చేయడం ఏంటి?పేర్లు మార్చి ప్రజలను ఎన్నాళ్ళు ఏమార్చగలరు..కనీసం ప్రధాని పోటో పెట్టరా? అంటూ ఇవాళ విష్ణు ట్వీట్‌ చేశారు. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఇరుకునపడింది.

jagan stealing centrally sponsored lands survey, bjp leader vishnu shocking comments

కేంద్ర ప్రభుత్వం గతంలోనే భూ వివాదాల పరిష్కారం కోసం స్వామిత్వ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేకు సిద్ధపడుతుండగా... వివాదాల తేనెతుట్టెను కదపడం ఎందుకని మరికొందరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుగా భూముల సర్వే చేపట్టింది. దీని స్ఫూర్తితో ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా భూముల సమగ్ర సర్వే చేపడుతోంది. అయితే ఇందులో ప్రధాని పేరు కానీ, కేంద్రం పేరు కానీ ప్రస్తావించకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

English summary
ap bjp leader vishnu vardhan reddy on tuesday made shocking comments on ap government's lands survey. he says that cm jagan is stealing centrally sponsored lands survey
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X