వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో 20ఏళ్ళు జగన్ ముఖ్యమంత్రిగా.. ఉగాదినాడు తిరుమల శ్రీవారిని కోరుకున్నానన్న ఎమ్మెల్యే రోజా

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈ రోజు ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఉగాది ఉత్సవాలలో ఉగాది పంచాంగ శ్రవణం విని, ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను తిలకించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక ఇప్పటికే ఏపీలో ఉన్న మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా ఎమ్మెల్యే రోజా ఉగాది పర్వదినం సందర్భంగా తన ఆకాంక్షను వెలిబుచ్చారు.

ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, కొత్తజిల్లాల ఏర్పాటు ఎలా ఉండబోతుందో చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డిఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, కొత్తజిల్లాల ఏర్పాటు ఎలా ఉండబోతుందో చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి

 ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రోజా

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రోజా

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఇటీవల యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రోజా, కాణిపాకం వినాయకుడికి పూజలు నిర్వహించారు .ఇక ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని రోజా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రోజా తెలుగు ప్రజలందరికీ శుభకృత్ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జగన్ మూడు రాజధానుల సంకల్పానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా: రోజా

జగన్ మూడు రాజధానుల సంకల్పానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా: రోజా


శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటూ రాష్ట్ర, నగరి ప్రజలకు మరియు మిత్రులు, శ్రేయోభిలాషులందరికీఉగాది శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న రోజా ఆపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 42 ఏళ్ల తర్వాత జిల్లాల విభజన పై సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని రోజా తెలిపారు. సీఎం జగన్ మూడు రాజధానుల సంకల్పానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. అంతేకాదు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్ కు శాశ్వత అధికారం ఉండాలని తాను స్వామివారిని కోరుకున్నట్టు రోజా పేర్కొన్నారు.

 జగన్ మరో 20 ఏళ్ళ పాటు సీఎంగా ఉండాలని వేడుకున్నా: రోజా

జగన్ మరో 20 ఏళ్ళ పాటు సీఎంగా ఉండాలని వేడుకున్నా: రోజా


రెండేళ్లుగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు నశించాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం అన్న రోజా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరో 20 ఏళ్లు ఉండేటట్టు చూడాలని కోరుకున్నట్లు తెలిపారు ఈనెల 4వ తేదీన జిల్లాల విభజన జరగబోతుందని, దీంతో పరిపాలన సులభతరం అవుతుందని పేర్కొన్న రోజా దీంతో ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని తాను కోరుకున్నట్టు తెలిపారు. నగరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

 తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం లో మంత్రి పేర్ని నాని

తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం లో మంత్రి పేర్ని నాని


ఇదిలా ఉంటే ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన ఉగాది ఆస్థానం లో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పేర్నినాని ఈ సంవత్సరం రైతులకు మంచి పంటలు వస్తాయని, పంచాంగ శ్రవణంలో చెప్పారని ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. ఇక ఉగాది పర్వదినం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో మంత్రి పేర్ని నాని, రోజా లతోపాటు, ఎం పి ఎంవి వి సత్యనారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

English summary
Nagari MLA Roja made interesting remarks over jagan on ugadi. Roja worshipped lord balaji and wish that jagan to be chief minister for another 20 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X