రజనీకాంత్ మాట్లాడేవన్నీ నిజాలే: జగపతిబాబు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా జగపతిబాబు పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్. ఆయన కీలక పాత్రలో నటించిన రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించారు. ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో జగపతిబాబు.. గోపీచంద్ కు అన్నగా నటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లతో చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే జగ్గూభాయ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా ఆయన పంచుకుంటున్నారు.

జగనపతిబాబు మనస్తత్వం గురించి అందరికి తెల్సిందే. మనసులో ఏది అనుకుంటాడో అది నిర్మొహమాటంగా బయటికి చెబుతారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. జగ్గూభాయ్ ఎదుట రజినీకాంత్ కాంట్రవర్సీ ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ వేడుకలో రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు గురించి చెప్పారు. చంద్రబాబు లో ఒక విజన్ ఉందని, ఆయన ఉన్నప్పుడు హైదరాబాద్ కు వస్తే న్యూయార్క్ కు వచ్చినట్లు ఉందని, ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచేదని కొనియాడారు.
రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. కొంతమంది నాయకులు రజినీకాంత్ ను అసభ్యపదజాలంతో దూషించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి జగ్గూభాయ్... రజనీకాంత్ 100 శాతం రైట్.
ఇది అనలేదు.. కానీ ఆయన మాట్లాడే విధానం, ఆయన అనే మాటలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. చక్కగా మాట్లాడతాడు.. నిజాయితీగా మాట్లాడతాడు.. నిజాలు మాట్లాడతాడు" అని చెప్పుకొచ్చాడు. మాట్లాడేవాళ్లు మాట్లాడుకొంటూనే ఉంటారు... అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications