ఎప్పుడు సమైక్యవాదినే, ఆత్మహత్యే: విలీనంపై జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు పార్టీలో విలీనం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే కొందరు కాంగ్రెసు నేతలు ఆ పార్టీలోకి వెళ్లే అవకాశముందన్నారు. అప్పుడు కాంగ్రెసు పార్టీయే నష్టపోతుందన్నారు. తెలంగాణ ఇచ్చాక విలీనం కాదు పొత్తు అని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెబితే అప్పుడు కాంగ్రెసు పార్టీది తెలంగాణలో ఆత్మహత్యే అవుతుందని హెచ్చరించారు. విలీనం కాకుండా విభజన అంటే కాంగ్రెసు పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు.
మార్చిలోగా రెండు రాష్ట్రాలు
ఈ ఏడాది మార్చి నెలలోగా రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశముందని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉన్మాదం: కెటిఆర్
తెలంగాణ ముసాయిదా బిల్లులను కాల్చడం ఉన్మాద చర్య అని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అరవై ఏళ్ల కల అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications