అంతరిక్ష యాత్రకు ఎంపికైన "పాలకొల్లు బంగారం".. స్పేస్ ను తాకిన తెలుగోడి సత్తా
జాహ్నవి దంగేటి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగుతోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల యువతి అద్భతం చేశారు. ఆమె 2029లో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029లో చేపట్టనున్న అంతరిక్షయానంలో ఆమెకు చోటు లభించింది. ఈ మేరకు ఆమెకు మూడేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. 2029లో భారత్ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న మహిళగా జాహ్నవి ఘనత సాధించనున్నారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029లో చేపట్టనున్న అంతరిక్షయాత్రకు ఆమె ఎంపికయ్యారు. ఈమేరకు ఆమెకు మూడేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
2029 మార్చిలో అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు జాహ్నవి. దాదాపు 5 గంటలపాటు ఆమె అంతరిక్షంలో ప్రయాణించనున్నారు. ఈ విషయాన్ని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. తెలుగమ్మాయి ఈ ఘనత సాధించడంతో అంతరిక్షం వరకూ తెలుగోడి సత్తా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాత్ర కోసం ఆమె మూడేళ్లపాటు శిక్షణ తీసుకోనున్నారు. ట్రైనింగ్ అనంతరం ఆమె అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు.

ఇక జాహ్నవి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోనే జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. బీటెక్ పూర్తయ్యాక అంతరిక్షం పట్ల చాలా ఆసక్తితో 2022 లో పోలాండ్ లోని అనలాగ్ స్పేస్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ పొందారు. అలా చిన్న వయస్సులోనే వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె అంతరిక్ష ప్రయాణం ఓకే కావడంతో జాహ్నవికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.












Click it and Unblock the Notifications