దీపావళి కోసం దివాళానా: కెసిఆర్ మేనిఫెస్టోపై జైరాం
హైదరాబాద్/ నిజామాబాద్: కె చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నికల ప్రణాళిక దివాలా తీసేలా ఉందని కేంద్ర జైరాం రమేష్ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా జైరాం శనివారంనాడు మాట్లాడారు. దీపావళి పండుగ చేసుకోవడానికి దివాలా తీయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యమైందని జైరాం స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ గడువు లోపలే పూర్తి అవుతుందని జైరాం రమేష్ అన్నారు. చట్ట ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని చెప్పారు. ఉద్యోగులను మూడు భాగాలుగా విభజిస్తున్నామని ఆయన చెప్పారు. స్థానిక, జిల్లా, రాష్ట్ర ఉద్యోగులుగా విభజన జరుగుతుందని చెప్పారు. 21 కమిటీల ఆధ్వర్యంలో విభజన ప్రక్రియ జరుగుతోందని ఆయన చెప్పారు.

తెరాస అధినేత కెసిఆర్‌లో స్వార్థం పెరిగిందని, ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారని మాజీ పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. తెలంగాణ నేతలు డీఎస్, మధుయాష్కి, మహేష్‌కుమార్‌గౌడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమైక్యవాదులకు తెరాస టికెట్లు ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సిఎం చేస్తానని చెప్పి మాట తప్పిన టీఆర్ఎస్ నేతలను దళితులు నిలదీయాలని డీఎస్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications