జగన్! పార్టీని మూసేస్తారా?: సవాల్ విసిరిన జలీల్ ఖాన్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను తిరిగి ఎన్నికల్లో గెలిస్తే పార్టీని మూసేస్తారా? అంటూ సవాల్ విసిరారు.
విజయవాడలో మ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి జలీల్‌ఖాన్ మీడియాతో మాట్లాడారు. 'మమ్మల్ని రాజీనామా చేయమని వైసీపీ నాయకులు కోరుతున్నారు. రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. ఆతర్వాత జరిగే ఎన్నికల్లో నేను గెలిస్తే వైసీపీని మూసేస్తారా' అంటూ జలీల్‌ఖాన ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్ విసిరారు.
'నాలుగేళ్లలో వైసీపీ కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టాను. నేను నోరు విప్పితే రహస్యాలు బయటపడతాయి'అని జలీల్ ఖాన్ హెచ్చరించారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెడతానని ప్రతిపక్ష నేత చేసిన ప్రకటనపై బుద్దా వెంకన్న స్పందించారు. జగన్‌కు దమ్ముంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తొలి బహిరంగ సభ పెట్టాలని సవాల్ విసిరారు. విజయవాడ బహిరంగ సభకు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని అన్నారు.

Click it and Unblock the Notifications