మంత్రి రోజాకు జనసేన నాయకుల షాకింగ్ గిఫ్ట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత చంద్రబాబు అరెస్టును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించడం, తెలుగుదేశం పార్టీకి అండగా పవన్ ఉంటామని చెప్పడం, చంద్రబాబు అరెస్ట్ అక్రమమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం వెరసి వైసీపీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ రోడ్లమీద దొర్లుతున్నాడు అని, చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్ కళ్యాణ్ కి కూడా పాత్ర ఉందేమో అని, ఒకవేళ అలా ఉంటే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రోజా చిలక జోస్యం చెప్పడానికి బాగా పనికొస్తుందని జనసేన నేతలు మండిపడుతున్నారు.
ఆరు నెలల తర్వాత రోజా చిలక జోస్యం చెప్పుకుంటాం అంటూ పార్కుల వెంట తిరగాల్సిందే అని ఆమెకు గిఫ్టుగా చిలక జోస్యం చెప్పడం కోసం ఒక చిలుకను, పంజరాన్ని, ఒక మఫ్లర్ ను, పూసల దండను, చిలక తీసే కార్డులను, మంత్రి రోజాకు నగరి అడ్రస్ కు పార్సల్ చేస్తామని జనసేన నాయకులు కిరణ్ రాయల్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఆరు నెలల తర్వాత రోజా పరిస్థితి చిలక జోస్యం చెప్పుకోవడమేనని ముందు రోజా, ఆమె వెనుక ఆమె భర్త రోజా సెల్వమణి చిలక జోస్యం చెప్పుకుంటూ తిరగాలని సెటైర్లు వేశారు.
రోజా కి జనసైనికులు కానుక..
— Kiran royal (@KiranRoyaljsp) September 12, 2023
ఆరు నెలల తరువాత
రోజా గారికి చిలక జోస్యం చేపుకోవలసిన అవసరం ఉందని చిలక జోస్యం సామగ్రి ను కానుకగా ఇవ్వనున్న @KiranRoyaljsp @JanaSenaParty @PawanKalyan pic.twitter.com/CBbIdft9gv

అన్ని తనకే తెలుసు అన్నట్టు రోజా అరెస్టుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి గురించి మాట్లాడుతున్న రోజా ఎమ్మెల్యే కాకముందు, మంత్రి కాకముందు తన ఆస్తులు ఎంత? ప్రస్తుతం తన ఆస్తులు ఎంతో చెప్పాలని, అవి నిజాయితీగా సాధించానని కాణిపాకం గణనాథుడి ఆలయంలో తన పిల్లలతో కలిసి ప్రమాణం చేస్తారా అంటూ ప్రశ్నించారు. రోజా తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications