Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భీమవరంలో వైసీపీ వర్సెస్ జనసేన ; ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై ఫ్లెక్సీ రగడ .. అసలేం జరిగిందంటే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం అనేక అంశాలపై రగడ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అభివృద్ధి కుంటుపడిందని, వైసీపీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని నిత్యం ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తుంటే, ఇక అప్పుడప్పుడు బిజెపి, జనసేనలు సైతం అధికార పార్టీ తీరుపై విరుచుకుపడుతున్నాయి.

 వైసీపీ జనసేన పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం

వైసీపీ జనసేన పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం

తాజాగా వైసిపి, జనసేన మధ్య ఓ ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. భీమవరం నియోజకవర్గంలో జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన, వైసిపి మధ్య ప్రస్తుతం డైలాగ్ వార్ కొనసాగుతోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు. భీమవరం ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ తరఫున మీకు ఒక విజ్ఞప్తి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణంలో అభివృద్ధి చాలా కుంటుపడిందని గత కౌన్సిల్లో టెండర్లు పిలిచిన పనులకు ఎమ్మెల్యేగా మీరు శంకుస్థాపన చేశారని కానీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొన్నారు.

భీమవరంలో అభివృద్ధిపై ప్రశ్నిస్తూ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

భీమవరంలో అభివృద్ధిపై ప్రశ్నిస్తూ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

జనసేన నాయకులు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటికీ ప్రజల దాహార్తిని తీర్చే లేకపోతున్నారు అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంతేకాదు సిసి రోడ్లు, డ్రైనేజీలు, బిటి రోడ్ల నిర్మాణానికి మీరు శంకుస్థాపనలు చేసి ఏడాదిన్నర కాలం ముగిసిపోయిందని కానీ ఇప్పటివరకు 10 శాతం పనులు కూడా పూర్తికాలేదు అని ఇప్పటికైనా భీమవరం పట్టణ అభివృద్ధిపై దృష్టి పెడతారని కోరుకుంటున్నాము అంటూ జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అభివృద్ధి జరగడం లేదని ఫ్లెక్సీ పెట్టిమరీ విమర్శలు గుప్పించారు జనసేన నాయకులు.

ఫ్లెక్సీ ఏర్పాటుపై వైసీపీ నేతల ఫైర్.. ఎస్పీకి ఫిర్యాదు

ఫ్లెక్సీ ఏర్పాటుపై వైసీపీ నేతల ఫైర్.. ఎస్పీకి ఫిర్యాదు

ఇక ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. భీమవరంలో అభివృద్ధి కుంటుపడిందని జనసేన నాయకులు ఎలా చెబుతారని, ఫ్లెక్సీని ఎలా ఏర్పాటు చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీపై తమ ఎమ్మెల్యే ఫోటో వేసి విమర్శించారని వైసిపి నాయకులు జనసేన తీరును తప్పు పట్టారు. తమ ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించారు అంటూ దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన నాయకుడు గోవిందరావుపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లి వైసిపి నాయకులు హంగామా చేశారు. ఇక వీరిని ఎదుర్కోవడానికి జనసేన నాయకులు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీని పోలీసులు తొలగించారు.

గతంలోనూ భీమవరంలో వైసీపీ జనసేనల మధ్య బాహాబాహీ

గతంలోనూ భీమవరంలో వైసీపీ జనసేనల మధ్య బాహాబాహీ


ఇక గతంలో కూడా భీమవరంలో వైసీపీ జనసేన నేతల మధ్య దళితులపై దాడి ఘటన విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఫిబ్రవరి నెలలో వీరవాసరం మండలం మత్స్యపురి లో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జనసేన నేతలపై ఆరోపణలు గుప్పించగా, గ్రంధి శ్రీనివాస్ ప్రోద్బలంతో పోలీసులు జనసేన నాయకులపై కేసులు నమోదు చేశారని, ఎస్సీ లైన తమ కార్యకర్తల పైన అట్రాసిటీ కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మత్స్యపురిలో దళితులపై దాడి చేశారని జనసేనని టార్గెట్ చేసిన గ్రంధి

మత్స్యపురిలో దళితులపై దాడి చేశారని జనసేనని టార్గెట్ చేసిన గ్రంధి

వీరవాసరం మండలంలో మత్స్యపురిలో అంబేద్కర్ విగ్రహానికి కొందరు చెప్పుల దండ వేశారు. దీనికి నిరసనగా దళితులు ఆగ్రహంతో రెచ్చిపో గా వారికీ, జనసేన కార్యకర్తలకు మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఇక దళితులకు మద్దతుగా గ్రంధి శ్రీనివాస్ రంగంలోకి దిగగా ఆయన పైనా దాడికి ప్రయత్నించారని గ్రంధి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలు సంఘవిద్రోహ శక్తులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడులను ప్రోత్సహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెడమీద తలకాయలు ఉండవంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు.

వైసీపీ ఎమ్మెల్యేను కుక్కతో పోల్చిన పవన్ కళ్యాణ్

వైసీపీ ఎమ్మెల్యేను కుక్కతో పోల్చిన పవన్ కళ్యాణ్

వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను కుక్కతో పోల్చి ఆయన మాటలను పట్టించుకోవద్దని, వీధి కుక్కల అరుస్తాయని, కొన్ని పిచ్చి కుక్కలు కురుస్తాయని, కుక్క కరిచిన అంత మాత్రాన వాటిని మనం కరవం కదా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎమ్మెల్యే భాష తీరు మార్చుకోవాలని చెప్పారు. జనసేన పార్టీ నేతలు అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు. వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం కూడా లేదన్నారు.

Recommended Video

    కిషన్ రెడ్డి యాత్రపై మండి పడ్డ టీపిసిసి ప్రధాన కార్యదర్శి..!! || Oneindia Telugu
    భీమవరం నుండి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్

    భీమవరం నుండి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్

    ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి ఎన్నికల బరిలోకి దిగి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేవలం 3,900 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ నుండి బరిలోకి దిగిన గ్రంధి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. వైయస్సార్సిపి జనసేన మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో ఓటమిపాలైనప్పటికీ, భీమవరం నియోజకవర్గం లో జనసేన ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే పై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అవుతుంది. ఈ క్రమంలోనే వైసిపి, జనసేన కు మధ్య భీమవరం నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక రగడ కొనసాగుతూనే ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+