జన్మభూమి, రత్నాచల్ తోపాటు మరికొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనకాపల్లి-తాడి స్టేషన్ల మధ్య డీప్ స్క్రీనింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు.
విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం (12805, 12806) మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్, విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ (12717, 12718)మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్, గుంటూరు-రాయగడ-గుంటూరు (17243, 17244) ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం-విశాఖపట్నం (17219, 17220) మధ్య నడిచే రైళ్లను ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

విశాఖపట్నం-తిరుపతి -విశాఖపట్నం (22708,22707 ) మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలును సైతం 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విశాఖపట్నం-సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఆయా తేదీల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారి టికెట్లు ఆటోమేటిక్ గా రద్దవడంతోపాటు వారి డబ్బులు కూడా రిఫండ్ అవుతాయి.
ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురై దాదాపుగా 300 మంది ప్రయాణికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మళ్లీ అటువంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తోంది. ఈ క్రమంలోనే పనులకు అంతరాయం కలుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దుచేయడంతోపాటు మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications