భారం మనదే: బాబు, జపాన్ బృందంతో..(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ ప్రభుత్వ పథకాలు సమీక్షించారు. విద్యుత్ అంశాన్ని ప్రస్తావిస్తూ పేదలపై భారం పడకుండా చూస్తున్నామన్నారు. వంద యూనిట్లులోపు వినియోగించే 1.17 కోట్ల కుటుంబాలకు ఎలాంటి భారం పడబోదని స్పష్టం చేశారు.

పేదలపై భారం పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. విద్యుత్ చార్జీల పెంపు అంశాన్ని ప్రజల్లో చర్చకుపెట్టి అభిప్రాయం సేకరించిన తర్వాతే ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ 58191 మిలియన్ యూనిట్లు ఉందని, ఇందుకోసం 30300 కోట్లు ఖర్చవుతుంటే, ఆదాయం 22592 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ఆదాయానికి వ్యయానికి మధ్య 7716 కోట్లు లోటుఉందని, లోటు పూడ్చేందుకు సరఫరా-పంపిణీ నష్టాలను పూడ్చడం, చౌర్యాన్ని నిరోధించడం, పిఎల్‌ఎఫ్ పెంచడం, సామర్థ్యాన్ని సాధించడం వంటి చర్యలు చేపడతామన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని కూడా సమతుల్యం చేస్తామన్నారు.

2019నాటికి విద్యుత్ రంగంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంటామని, చార్జిలు పెంచాల్సివస్తే పేదలపై భారంపడకుండా చూస్తామన్నారు. ఛార్జీల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, నాణ్యమైన విద్యుత్ తక్కువ రేటుకు ఇవ్వడమే లక్ష్యమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో ఎలాంటి ఢోకా ఉండదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశం తేలేందుకు మార్చి 31వరకూ గడువుందని వివరించారు.

ఇది ఇలా ఉండగా జపాన్ దేశ ప్రతినిధుల బృందం సచివాలయంలో సిఎం చంద్రబాబునాయుడును కలిశారు. ఈ భేటీలో నూతన రాజధాని అభివృద్ధిపై చర్చలు జరిపినట్లు

జపాన్ బృందంతో..

జపాన్ బృందంతో..

జపాన్ దేశ ప్రతినిధుల బృందం సచివాలయంలో సిఎం చంద్రబాబునాయుడును కలిశారు.

జపాన్ బృందంతో..

జపాన్ బృందంతో..

జపాన్ ప్రతినిధుల భేటీలో నూతన రాజధాని అభివృద్ధిపై చర్చలు జరిపినట్లు సమాచారం.

జపాన్ బృందంతో..

జపాన్ బృందంతో..

జపాన్ దేశ ప్రతినిధుల బృందం సచివాలయంలో సిఎం చంద్రబాబునాయుడును కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ ప్రభుత్వ పథకాలు సమీక్షించారు.

చంద్రబాబు

చంద్రబాబు

విద్యుత్ అంశాన్ని ప్రస్తావిస్తూ పేదలపై భారం పడకుండా చూస్తున్నామన్నారు. వంద యూనిట్లులోపు వినియోగించే 1.17 కోట్ల కుటుంబాలకు ఎలాంటి భారం పడబోదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+