జగన్ సిఎం అవుతారా: జెసి దివాకర్ రెడ్డి మరోసారి ఏమన్నారు?

వైయస్ జగన్‌పై జెసి దివాకర్ రెడ్డి మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ బస్సు ప్రమాదంపై వైసిపి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌కు అధికారం పిచ్చిపట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని ఆయన అన్నారు. దివాకర్ ట్రావెల్స్ ప్రమాద సంఘటనపై అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బస్సు ప్రమాదం కేవలం మానవ తప్పిదం అంతే దాన్ని అనవసర రాజకీయం చేయాలనుకోవడం తగదని,, ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు తెలుసుకుంటే మంచిదని ఆయన అన్నారు.

JC Diwakar Reddy

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఈ ప్రమాద ఘటనను రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారిపై దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ వైపు వెళ్తూ నందిగామా దగ్గర కల్వర్టు గోడను బలంగా ఢీకొంది. గోడను ఢీకొన్న వేగానికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. ఈ ఘటనలో 10 మరణించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+