అసెంబ్లీలో మీరే! ఇక్కడా మీరేనా?: జగన్ పార్టీ ఎమ్మేల్యేకి జేసీ ఝలక్

Subscribe to Oneindia Telugu

అనంతపురం: తెలుగుదేశం సీనియర్ నేత, అనంతపురం పార్లమెంటుసభ్యుడు తన సంచనల వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో ఉంటారనేది తెలిసిన విషయమే. అంతేగాక, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా కూడా ఉంటుంది. తాజాగా, సోమవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ ఆయన సరదా సరదా వ్యాఖ్యలతో అక్కడ నవ్వుల వాతావరణం సృష్టించారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభమైన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి సమావేశ మందిరంలో అడుగుపెట్టారు. ముందు వరుసలో కూర్చోడానికి కుర్చీ ఖాళీ లేకపోవడంతో సభ్యులు కూర్చునే చివరి వరుసలో కూర్చుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన అధికారులు వెంటనే.. జేసీని ముందు వరుసలో కూర్చోవాలని కోరారు.

jc diwakar reddy takes on YSRCP MLA basha

అప్పటికే జేసీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పక్కన చివరి వరుసలో కూర్చున్నారు. ఈ సమయంలోనే తాగునీటి సమస్యప కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా మాట్లాడారు. ఈ సందర్భంలో జేసీ తనదైన శైలిలో కల్పించుకున్నారు.

'ఏమయ్యా.. ఇక్కడ కూడా మీరేనా? అసెంబ్లీలో మీరే మాట్లాడారు! ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీపీలకు అవకాశమివ్వండి. కూర్చో' అని జేసీ.. వేసీపీ ఎమ్మెల్యేకు చురకంటించారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే బాషా తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో జేసీ కొంత ఆగ్రహానికి గురయ్యారు.

ఏమయ్యా. వాళ్ల(జడ్పీటీసీలకు, ఎంపీపీల)కు అవకాశమివ్వమంటే.. నువ్వే మాట్లాడుతున్నావ్? మరోసారి అన్నారు. దీంతో వెంటనే బాషా తన ప్రసంగాన్ని ముగించారు. ఇది ఇలా ఉండగా, ఎమ్మెల్యే బీకే పార్థసారథి కలగజేసుకుని.. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను మనం చెప్పకపోతే ఎవరు చెబుతారని ఎంపీ జేసీతో అన్నారు. దీంతో కాసేపు సమావేశం ఉన్న జేసీ.. ఆ వెంటనే వెళ్లిపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam MP JC Diwakar Reddy takes on YSRCP MLA basha in anantapur ZP meeting.
Please Wait while comments are loading...