28 వాహనాలపై 156 కేసులా ? పెద్దారెడ్డి పిచ్చోడు- జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాల స్కాం కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ఇప్పటికే పలు కేసులు నమోదుచేసిన వైసీపీ సర్కార్.. జైలుకు కూడా పంపింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వైసీపీ సర్కార్ పై జేసీ విరుచుకుపడ్డారు.

ఏదైనా వాహనం రిజిస్ట్రేషన్ చేయాలంటే చట్టప్రకారం ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలని, గతంలోనే ఈ విషయం పై కేసులు నమోదయ్యాయని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నకిలీ పత్రాల తో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారని అధికారుల్ని ఆయన ప్రశ్నించారు. మళ్లీ నకిలీ బీమా పై కేసు పెట్టాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పడం అవివేకమన్నారు. తాము కొనుగోలు చేసిన సమయంలో 63 వేల వాహనాలను అశోక్ లైలండ్ అమ్మకాలు సాగించిందని జేసీ గుర్తుచేశారు. స్క్రాప్ అన్నప్పుడు విడిభాగాలు అమ్మాలని, మా వద్ద పుల్ వాహనానికి జీఎస్టీ కట్టించుకున్నారని అన్నారు.

jc prabhakar reddy sensational comments on fake vehicles row, dares to drag officials

ఇటీవల 22 వేల కార్లు హిమాచల్ ప్రదేశ్ లో పట్టుకున్నారని జేసీ తెలిపారు. దేశం లో ఒక్క ప్రభాకర్ రెడ్డి మినహా ఎవరి పైనా కేసులు పెట్టలేదన్నారు. నావి వాహనాలు 28 అయితే 156 కేసులు పెట్టారన్నారు. ఇప్పటికే తాను 156 రోజులు జైలుకి వెళ్లి బాధపడి వచ్చానన్నారు. ఈ సందర్భంగా మీసం తిప్పి, తొడ కొట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి..దమ్ము ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్ లపై కేసులు పెట్టాలన్నారు. మొత్తం అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడని, ఆయన ఇంట్లో పిచ్చోళ్ళు ఉన్నారన్నారు. వాళ్ల తమ్ముడు ఎక్కడున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ధర్మవరం ఎమ్మెల్యే బైక్ రేస్ లు, గుర్రాల రేస్ లు చేసుకోనీ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ చేసుకో అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపైనా జేసీ విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+