జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్..!!

టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని తమ పార్టీ నేతల పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తుందని ఆరోపిం చారు. అదే సమయంలో తమ కుటుంబ సభ్యులు మీద ఉన్న బియ్యం ఆరోపణల గురించి వివరణ ఇచ్చారు. పేర్ని నాని చేసిన కామెంట్స్ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పేర్ని నానికి వార్నింగ్ ఇచ్చారు.

పేర్ని నాని లక్ష్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో.. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్స్ చేసినప్పుడు సభ్యత ఏమైందని నిలదీసారు. తన గడ్డం గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తన తప్పులు లేని రోజున తాను గడ్డం తీసేస్తానని, అందుకే తాను గడ్డం పెంచుతున్నానని.. ఊరికే కాదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి తనం కారణంగానే వైసీపీ నేతలు బయట తిరుగుతున్నారని.. కార్యకర్తల చేతులు కట్టేసారని జేసీ పేర్కొన్నారు.

JC Prabhakar Reddy warns YCP leader Perni Nani interesting comments over Chandra Babu

పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబుకు జేసీ సూచించారు. పేర్ని నాని ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసారు. 'పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు.. ఇంటి కొచ్చి నిన్ను కొట్టిన అడిగే దిక్కు లేదు... మరోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తా' అంటూ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే విధంగా పేర్ని నాని కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావు అంటూ జేసీ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కుటుంబం గురించి.. పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదా అంటూ నిలదీసారు. చంద్రబాబు తమకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వారికి బుద్ధి చెబుతామని వ్యాఖ్యానించారు. పేర్ని నాని దొంగతనం ఒప్పుకోవాలని .. లేకపోతే, ధైర్యంగా నిలబడాలని జేసీ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+