అపకారం చేశాం, మన్నించండి: బాబుకు జేసీ దివాకర్
హైదరాబాద్: గత ఎన్నికల్లో రాయలసీమ రెడ్డి కులం వాళ్లం మీకు ఓటు వేయకుండా అపకారం చేశామని, మీరు మన్నించి ఒక్కసారి తమకు ఉపకారం చేయండని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబును కోరారు. కులాలు, మతాలు అనేవి మనం గీసుకున్న గీతలని చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పారు.
చంద్రన్న వ్యవసాయ రైతు క్షేత్రం కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు
గన్నవరం మండలం కేసనపల్లిలో చంద్రన్న వ్యవసాయ రైతు క్షేత్రం కేంద్రాన్ని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. గన్నవరం మండలం కేసనపల్లిలో చంద్రన్న వ్యవసాయ రైతు క్షేత్రం కేంద్రాన్ని పరిశీలించారు.
ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించడంలో తెలుగుదేశం, బీజేపీ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని నెల్లూరు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర విభజనకు యుపిఏ ప్రభుత్వం తొందరపడిందని, ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చలేదని, అయితే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదని, పదేళ్లు ఇస్తామని ఊదరగొట్టారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
ఏపికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతి పత్రం ఇచ్చారన్నారు.
కొత్త రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి భూములు లాక్కోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications