నితీశ్ "హోదా" మెలికతో ఇరకాటంలో చంద్రబాబు..!!
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ, జేడీయూ ఉన్నాయి. జేడీయూ తాజాగా బీహార్ కు ప్రత్యేక హోదా పైన తీర్మానం చేసింది. మరి కొద్ది నెలల్లో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. తమకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ తీర్మానంలో ప్రతిపాదించారు. ఇప్పుడు ఏపీలో హోదా డిమాండ్ పెండింగ్ ఉన్న సమయంలో చంద్రబాబు పైన ప్రభావం పడనుంది. మరి..చంద్రబాబు ఏం చేస్తారు. ఎలాంటి అడుగులు వేస్తారు.
తెర మీదకు హోదా
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు. పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నితీశ్ తమ రాష్ట్రానికి హోదా అంశం ద్వారా రాజకీయంగా మెలిక పెట్టారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు. అప్పుడే బీహార్ కు ప్రత్యేక హోదా కావాలంటూ నితీశ్ తీర్మానం చేయటం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. పార్టీ జాతీయ కార్యవర్గం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.

జేడీయూ తీర్మానం
బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ఆర్దిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది,. దీంతో పాటుగా ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్ లో ప్రత్యేక, కఠిన చట్టం చేయాలని కోరింది. ఇక..నితీశ్ తాజా నిర్ణయం ప్రభావం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పైన పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు.
చంద్రబాబు వాట్ నెక్స్ట్
కేంద్రంలో ఎన్డీఏలో చంద్రబాబు మద్దతు కీలకంగా మారిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కొద్ది రోజుల క్రితం ఎన్నికల ఫలితాల పైన సీమక్షా సమావేశంలో పార్టీ నేతలతో జగన్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హోదా స్ధానంలో ప్యాకేజీ పైన ముసాయిదా సిద్దమైంది. అయితే, హోదా చంద్రబాబు వద్దన్నారనే ప్రచారంతో నాడు ప్యాకేజీ పైన నిర్ణయం జరగలేదు. ఇప్పుడు నితీశ్ తాజాగా హోదా పైన చేసిన తీర్మానం పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందీ...చంద్రబాబు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు..ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications