2లక్షల మందికి ఉద్యోగాలు.. చంద్రబాబు కీలకవ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పురోగతి బాట పట్టించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు నేడు రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

చెత్త నుంచి సంపద సృష్టించడమే కొత్త విధానం: సీఎం చంద్రబాబు
రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ప్రారంభమవుతున్న పరిశ్రమలపై, పారిశ్రామిక వేత్తలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చెత్త నుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానం అని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు దీనిని అందిపుచ్చుకోవటం సంతోషదాయకం అని చంద్రబాబు అన్నారు.

jobs-for-2-lakh-people-with-the-investment-festival-in-ap-chandrababu-key-comments

పారిశ్రామిక వేత్తలకు కష్టం లేకుండా వనరులు
రాష్ట్రంలోని రైతులకూ ప్రయోజనం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్న చంద్రబాబు గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయని, పారిశ్రామిక వర్గాలు పారిపోయారని, గత ప్రభుత్వం పి పి ఏ లను రద్దు చేసిందని గుర్తు చేశారు.

అన్ని వసతులతో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
దీని కారణంగా కరెంటు వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాధనం చెల్లించామని ఆ నిధులే ఉండి ఉంటే అనేక ప్రాజెక్టులు కట్టుకునే వాళ్ళమని గుర్తు చేశారు. ప్రస్తుతం పారిశ్రామికవేత్తల కోసం పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారులు, కామన్ ఇన్ఫ్రాను క్రియేట్ చేస్తున్నాం అన్నారు. ఆలోచనతో వస్తే చాలు పారిశ్రామిక యూనిట్ పెట్టొచ్చు అని భరోసా ఇచ్చారు.

కేంద్రం తెచ్చే ప్రతీ పాలసీ ఏపీలో అమలు
సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో 17 నెలల క్రితం పాలనా పగ్గాలు చేపట్టి ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ నడుస్తోందని, విశాఖకు లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ వస్తుందని చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్రం ఏ పాలసీ తీసుకువచ్చిన మొదటి దానిని ఏపీ అమలు చేస్తోందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.

2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు
పట్టు వదలని విక్రమార్కుడిలా మంత్రి లోకేష్ పని చేస్తున్నారన్నారు. జనవరి నాటికి మరో 70 msme పార్కులను ప్రారంభిస్తామన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి ప్రతీ కుటుంబంలోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారుచేస్తాం అన్నారు. నేడు 99 కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని, వీటి ద్వారా రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.

క్వాంటం కంప్యూటర్లను మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి
చంద్రబాబు. భవిష్యత్ అంతా టెక్నాలజీదే, క్వాంటం కంప్యూటింగ్ జనవరికి అమరావతిలో ప్రారంభం అవుతుంది అని శుభవార్త చెప్పారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లను మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించేలా పరిస్థితి మారుతుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని ఇంటి నుంచే తయారు చేసుకునేలా ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

ఓర్వకల్లులో డ్రోన్ సిటీ.. ఆపరేషన్ సిందూర్ డ్రోన్లు టెస్ట్ ఇక్కడే
రిలయన్స్ బయో ఫ్యూయెల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు. డ్రోన్ సిటీని ఓర్వకల్లు లో ఏర్పాటు చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ లో వాడిన డ్రోన్లను కూడా ఇక్కడే టెస్ట్ చేశారు అని చంద్రబాబు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+