దోచడం జగన్‌కు, ముంచడం చిరంజీవికి: నేతల ఆగ్రహం

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, అనుకూలమని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, అధిష్టానం మాటే అంటు చెప్పిన చిరంజీవికి జై సమైక్యాంధ్ర పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని జై సమైక్యాంధ్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పదవి కోం తెలుగు గడ్డను పగలగొట్టమని చంద్రబాబు రెండుసార్లు లేఖలు ఇచ్చారన్నారు.

చంద్రబాబు తెలుగుజాతి ద్రోహి, వచ్చే ఎన్నికల్లో టిడిపిని చిత్తుగా ఓడించాలని ఆయన కోరారు. వైకాపాతోనే అభివృద్ధి సాధ్యమని జగన్, షర్మిల చెప్పడం హాస్యాస్పదమన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం 20 వేల కోట్ల రూపాయల లోటు ఉంటుందని వాస్తవాలు తెలిసినా, 20 వేల కోట్ల రూపాయలు ఎలా మాఫీ చేస్తారో దానికి సమాధానం జగనే చెప్పాలన్నారు. కిరణ్‌ తన పదవిని వదులుకున్నారని, విభజనను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. కాంగ్రెస్ అసలు వెన్నుపోటుదారుడు చిరంజీవే అని, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ వెన్నుపోటు పొడిచారని చిరంజీవి వ్యాఖ్యానించడం గర్హనీయమన్నారు.

JSP, TDP targets Chiranjeevi and YS Jagan

రైతులకు రుణ మాఫీని వద్దంటున్న జగన్ రైతు వ్యతిరేకి అని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. రైతులకు కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు అన్నట్టుగా జగన్ తన పార్టీ విధానాలలో రైతుల గురించే ప్రస్తావించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతులకున్న అప్పులు ఏమిటో, కష్టాలు ఏమిటో జగన్‌కు ఏమి తెలుస్తుందని ఆయన విమర్శించారు. జగన్‌కు తెలిసిందల్లా తనకు, తను అనుయాయులకు దోచుకోవడం, దాచుకోవడమే అన్నారు.

నమ్మినవారిని నట్టేట ముంచడం చిరంజీవి నైజం: పుష్పరాజ్

నమ్మిని వారిని నట్టేట ముంచడమే చిరంజీవి నైజం అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జెఆర్ పుష్పరాజ్ ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి తన వెంట వచ్చినవారిని పట్టించుకోకుండా తన పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసారని విమర్శించారు. చిరంజీవిని, ఆయన నమ్ముకున్న సోనియా గాంధీ పార్టీకి సీమాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పేరోజు వచ్చిందని పుష్పరాజ్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+