
ఏపీలో జీఎస్టీ కలెక్షన్ల పరుగులు: వసూళ్లలో 46% వృద్ధి: తెలంగాణ కంటే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల (GST) వసూళ్లు పెరిగాయి. కిందటి నెలతో పోల్చుకుంటే 56 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఆశించిన స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. మే వసూళ్లతో పోల్చుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ పెరిగింది. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. 46 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు నమోదయ్యాయి. మే నెలలో 47 శాతం మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి ఏపీలో.
వంగవీటి
రాధతో
నాదెండ్ల
మనోహర్
భేటీ:
తండ్రి
జయంతి
నాడే
ముహూర్తం
ఫిక్స్?
మే నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,40,885 కోట్ల రూపాయలు. నెల తిరిగే సరికి ఈ సంఖ్య మరింత పెరిగింది. 1,44,616 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్లు రికార్డయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా 25,306 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 32,406 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 75,887 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. సెస్ వాటా 11,018 కోట్ల రూపాయలు.

ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి 46 శాతంగా నమోదయ్యాయి. మే నెలలో 47 శాతం జీఎస్టీ వసూళ్లు నమోదు కాగా.. జూన్‌లో ఒక్కశాతం తగ్గుదల చోటు చేసుకుంది. జూన్ నెలలో 2,987 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గత సంవత్సరం అంటే 2021 జూన్ నెలలో ఏపీలో రికార్డయిన జీఎస్టీ వసూళ్ల మొత్తం 2,051 కోట్ల రూపాయలు. ఈ సారి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంది. తెలంగాణలో ఈ సంఖ్య 37 శాతం వద్ద పరిమితమైంది.
రాష్ట్రాలవారీగా
చూసుకుంటే..
జమ్మూకాశ్మీర్-రూ.372
కోట్లు,
హిమాచల్
ప్రదేశ్-రూ.693
కోట్లు,
పంజాబ్-రూ.1,683
కోట్లు,
చండీగఢ్-రూ.170
కోట్లు,
ఉత్తరాఖండ్-రూ.1,281
కోట్లు,
హర్యానా-రూ.6,714
కోట్లు,
ఢిల్లీ-4,313
కోట్లు,
రాజస్థాన్-3,386
కోట్లు
నమోదయ్యాయి.
ఉత్తర
ప్రదేశ్-రూ.6,835
కోట్లు,
బిహార్-రూ.1,232
కోట్లు,
సిక్కిం-రూ.256
కోట్లు,
అరుణాచల్
ప్రదేశ్-రూ.59
కోట్లు,
నాగాలాండ్-రూ.34
కోట్లు,
మణిపూర్-రూ.39
కోట్లు,
మిజోరం-రూ.26
కోట్లు,
త్రిపుర-రూ.63
కోట్లు,
మేఘాలయ-రూ.153
కోట్లు
వసూళ్లు
అయ్యాయి.
అస్సాం-రూ.972 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,331 కోట్లు, జార్ఖండ్-రూ.2,315 కోట్లు, ఒడిశా-3,965, ఛత్తీస్‌గఢ్-2,774 కోట్లు, మధ్యప్రదేశ్-రూ.2,837 కోట్లు, దాద్రానగర్ హవేలి-రూ.350 కోట్లు, గుజరాత్-9,207 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.22,341 కోట్లు, కర్ణాటక-రూ.8,845 కోట్లు, గోవా-రూ.429 కోట్లు, కేరళ-రూ.2,161 కోట్లు, తమిళనాడు-రూ.8,027 కోట్లు, పుదుచ్చేరి-రూ.182 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.22 కోట్లు, తెలంగాణ-రూ.3,901 కోట్లు, లఢక్-రూ.13 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.