• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Junior NTRను టార్గెట్ చేసిన టీడీపీ : నాని..వంశీని ఏమనరా -ట్రాప్ లో చిక్కారా : పక్కా స్కెచ్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు, చంద్రబాబు..భువనేశ్వరి పేరు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు. కొడాలి నాని..వల్లభనేని వంశీని ఎందుకు ఏమీ అనలేదు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా కామన్ పబ్లిక్ లోనూ మొదలైన చర్చ ఇది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..మీడియా ముందు చంద్రబాబు కన్నీరు అంశంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సడన్ ఛేంజ్ కనిపించింది. చంద్రబాబు కన్నీరు పెట్టటం చూసిన పలువురు స్పందించారు.

  Chandrababu Issue : JR NTR ఎటు వైపు ? నాని, వంశీని ఏమనరా ? పక్కా స్కెచ్..!! || Oneindia Telugu
  తీవ్రంగా రియాక్ట అయిన నందమూరి ఫ్యామిలీ

  తీవ్రంగా రియాక్ట అయిన నందమూరి ఫ్యామిలీ

  తన భార్యపైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ చంద్రబాబు ఆవేదనతో కన్నీరు పెట్టటం పైన నందమూరి కుటుంబంతో పాటుగా పలువురు ప్రముఖులు ఆ వ్యవహారన్ని తప్పు బట్టారు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. పలువురు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాని నందమూరి కుటుంబం సైతం బయటకు వచ్చింది. తమ ఇంటి ఆడపడుచు గురించి ఇటువంటి వ్యాఖ్య లు చేస్తారా అంటూ ఆగ్రహించింది. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చింది. నందమూరి వంశం మరో రూపం చూస్తారంటూ ఆ కుటుంబం హెచ్చరించింది.

  జూనియర్ ఎన్టీఆర్ పైన ఒత్తిడి

  జూనియర్ ఎన్టీఆర్ పైన ఒత్తిడి

  ఎన్టీఆర్ కుమారుడు రామక్రిష్ణ నేరుగా మంత్రి కొడాలి నాని .. వల్లభనేని వంశీ..అంబటి రాంబాబు.. ద్వారంపూడి పేర్లు చెప్పి మరీ హెచ్చరించారు. ఇదే సమయంలో టీడీపీ అభిమానుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ పైన ఒత్తిడి పెరిగింది. నందమూరి కుటుంబ సభ్యుడుగా ఉంటూ..ఎన్టీఆర్ కుమార్తెను అవమానించేలా మాట్లాడి...చంద్రబాబు కన్నీరు పెడితే తారక్ స్పందించరా అంటూ నిలదీసారు. ఎందుకీ మౌనం అంటూ నిలదీసారు. అయితే, ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లిన తారక్ వీడియో సందేశం ఇచ్చారు. అందులో జూనియర్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు.

  చంద్రబాబు పేరు ఎత్తలేదు..వారిని ప్రస్తావించలేదు

  చంద్రబాబు పేరు ఎత్తలేదు..వారిని ప్రస్తావించలేదు


  మొత్తం తన సందేశంలో ఎక్కడా చంద్రబాబు.. భువనేశ్వరి పేరు ప్రస్తావించ లేదు. టీడీపీ..వైసీపీ పేర్లు తీసుకురాలేదు. జరిగిన ఘటన మాత్రం తప్పని చెప్పారు. తాను ఆ కుటుంబ సభ్యుడిగా కాదని..ఒక బిడ్డగా..భర్తగా..తండ్రిగా..దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు. వైసీపీలో తమను దూషించారని నందమూరి కుటుంబ సభ్యులు ప్రస్తావిస్తున్న మంత్రి కొడాలి నాని..వల్లభనేని వంశీ పైన ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ఇది టీడీపీ శ్రేణులకు రుచించ లేదు. దీంతో..పలువురు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు..వీడియోల ద్వారా జూనియర్ ను నిలదీస్తున్నారు.

  వారిద్దరికీ స్నేహితుడనే కారణంతోనే అంటూ

  వారిద్దరికీ స్నేహితుడనే కారణంతోనే అంటూ

  వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానికి అత్యంత స‌న్నిహితుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు గుర్తింపు వుంది. భువ‌నేశ్వ‌రిపై మొద‌ట‌గా అభ్యంత‌ర‌కర వ్యాఖ్యలు వల్లభనేని వంశీ చేసారు. త‌న మేన‌త్త భువ‌నేశ్వ‌రిపై దూష‌ణ‌ల‌కు పాల్ప‌డిన‌, అలాగే చంద్ర‌బాబు క‌న్నీటిపై మాట మాత్రం కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తావించ‌కపోవ‌డం స‌హ‌జంగానే టీడీపీ నేత‌ల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానికి అత్యంత స‌న్నిహితుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు గుర్తింపు వుంది. అసలు ఎన్టీఆర్ స్పందించిన వీడియోను టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో షేర్ చేయలేదు.

  టీడీపీ శ్రేణుల్లోనూ చర్చగా..

  టీడీపీ శ్రేణుల్లోనూ చర్చగా..

  నందమూరి కుటుంబం మొత్తం ఈ అంశం పైన తీవ్రంగా స్పందించినా...జూనియర్ ఆచితూచి అడుగులు వేయటం వెనుక ఆలోచన ఏంటనే దాని పైన చర్చ మొదలైంది. అటువైపు నందమూరి ఫ్యామిలీలో బాలయ్య నేరుగా ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా..వైసీపీ నేతలంటూ మాట్లాడారు. చేతులు ముడుచుకొని కూర్చోలేదంటూ హెచ్చరించారు. చంద్రబాబును చూసి ఇంతకాలం ఆగామని..ఇక, ఎవరూ ఆపలేరంటూనే మిమ్మల్ని మీరు కాపాడుకోండంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ మంత్రులు ... నేతలు తాము అసలు ఎక్కడా భువనేశ్వరి పేరే ప్రస్తావించ లేదని చెబుతున్నారు.

  తారక్ ఆచి తూచి స్పందించటం వెనుక

  తారక్ ఆచి తూచి స్పందించటం వెనుక

  వారి మాటలు జూనియర్ నమ్మకపోయినా...తనతో చంద్రబాబు వ్యవహరించిన తీరు, అదే విధంగా బాలయ్య - లోకేశ్ చేసిన వ్యాఖ్యల పైన జూనియర్ ఆవేదన చెందినట్లుగా చెబుతున్నారు. ఆ సమయంలో తారక్ కు మద్దతుగా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. కానీ, జూనియర్ గత అనుభవాలు.. భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకొనే ఆచితూచి వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో తారక్ తో పాటుగా కళ్యాణ్ రాం సైతం ఇద్దరూ ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడారంటూ మరో ప్రచారం సాగుతోంది. తాము తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాత కలుస్తామని చెప్పారని చెబుతున్నారు.

  ట్రాప్ లో చిక్కకుండా..వ్యూహాత్మకంగా

  ట్రాప్ లో చిక్కకుండా..వ్యూహాత్మకంగా

  అయితే, అసలు చంద్రబాబు ట్రాప్ లో జూనియర్ పడకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించారని..ఆయన అందరికీ మంచి చెప్పే విధంగా వ్యవహరించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పడు జూనియర్ ను టీడీపీ అభిమానులు టార్గెట్ చేయటం పైన తారక్ అభిమానులు అసహనంతో కనిపిస్తున్నారు. తారక్ విదేశీ యాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఆయన వేసే అడుగులతో ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  TDP leaders have now targetted Junior NTR for not mentioning Chandrababu name while condemning the act on the latter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X