జగన్ రెచ్చగొడ్తున్నారు, రెచ్చిపోయిన రోజా: జూపూడి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ఆదివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జగన్ దళితుల పైన దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
దళితులు తన కాలిగోటికి కూడా సరిపోరంటూ వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే రోజా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదన్నారు. రోజా పైన ప్రభుత్వం సుమోటోగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

లేదంటే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి రోజా వ్యాఖ్యలను తీసుకు వెళ్తామని హెచ్చరించారు. అవసరమైతే పార్లమెంటుకు కూడా వెళ్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ నేతలు అవమానానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు.
దళితులను అవమానించడం రోజాకు కొత్త కాదని మరో టీడీపీ యువ నేత అన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర సందర్భంగా రోజా దళితుల పైన దాడి చేశారని నగరి పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయిందన్నారు. రోజా పైన డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications