జగన్ సిఎంలా.. బాబు విపక్ష నేతలా: నెహ్రూ ఫైర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే.. సిఎం చంద్రబాబు విపక్ష నేతలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు.

రాజధాని ఏర్పాటుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పారు. తమపై తెలుగుదేశం నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. రాయలసీమ తాగునీటి విషయంలో తాము అడ్డుపడుతున్నామంటూ ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothula Nehru fires at AP CM Chandrababu

పట్టిసీమ ఎత్తిపోతల పథకం కేవలం టిడిపి నేతల కమిషన్ల కోసమే ప్రతిపాదిస్తున్నారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే మన చేత్తో మనకళ్లు పొడుచుకున్నట్లేనని అన్నారు. దివంగత సిఎం వైయస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఆయనకు మంచిపేరు వస్తుందన్న దుర్బిద్ధితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+