నన్నెవరూ బలవంత పెట్టలేదు, పరిస్తితులే తలెత్తాయి: నెహ్రూ

హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆ పార్టీ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో భేటీ తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

తాను పార్టీ వీడే పరిస్థితులు తలెత్తాయని, తన నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్మాణం ప్రజలు కోరుకున్నట్లుగా లేదని ఆయన అన్నారు. పార్టీలోని పరిణామాలపై నాయకులే ఆలోచించుకోవాలని అన్నారు.

Jyothula Nehru says YCP is not according to the wishes of public

నియోజకవర్గం అభివృద్ధి పనులపైనే తాను మంత్రి యనమలతో చర్చించినట్లు తెలిపారు. యనమలతో గానీ తెలుగుదేశం పార్టీ నాయకులతో గానీ తనకు శత్రుత్వం లేదని అన్నారు. తాను పదవుల చుట్టూ తిరగలేదని, పదవులే తన చుట్టూ తిరుగుతున్నాయని నెహ్రూ అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తనకు అసంతృప్తి లేదని, టిడిపిలో చేరడానికి ఎవరూ బలవంత పెట్టలేదని ఆయన అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే మారుతున్నానని ఆయన చెప్పారు. పార్టీని రూపొందించుకోవడంలో మాత్రం అసంతృప్తి ఉందని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమైనా సరైన నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు సూచించారని ఆయన అన్నారు.

జ్యోతుల నెహ్రూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. టిడిపిలో చేరడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+