Chandrababuపై కందుకూరు పీఎస్ లో KA Paul ఫిర్యాదు- షాకింగ్ డిమాండ్స్..
ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చనిపోయారు. ఈ ఘటన ఇవాళ ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇందులో దూరారు.
కందుకూరులో తొక్కిసలాట ఘటనపై ఆయన ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న సందులో రోడ్ షో నిర్వహించి 8 మంది మృతికి కారణమైన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కందుకూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కందుకూరులో ఘటనా స్ధలిని సందర్శించిన కేఏ పాల్.. అనంతరం పీఎస్ వెళ్లి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఇందులో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిజానిజాలు వెలికి తీయాలని కేఏ పాల్ కోరారు. ఈ సందర్భంగా పాల్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కూడా చేశారు.

చంద్రబాబు నడిరోడ్డుమీద వెయ్యి మంది పట్టే చోట 50-60 వేల మందిని ఎలా పిలిచారని, బిర్యానీలు ఎందుకు పంచారని పాల్ ప్రశ్నించారు. 8 మంది ప్రాణాలకు పది లక్షలు ఇచ్చి వదిలేస్తారా అని అడిగారు. మీ ప్రాణాలకు 10 లక్షల కోట్లు, జనం ప్రాణాలకు 10 లక్షలా అని పాల్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పాటు ఇతర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చంద్రబాబు.. అవేవీ పట్టించుకోకుండా సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇలాంటి చర్యలకు సిగ్గుపడాలన్నారు. కాబట్టి చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యుడిని వహిస్తూ రాజీనామా చేయాలని, ఆయన్ను కందుకూరు ఘటనకు బాధ్యుడిని చేస్తూ అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications