ఈసారి అక్కడ ఎవరు గెలిస్తే వారిదే అధికారం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందు అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీకి బలంగా ఉన్న జిల్లాల్లో దెబ్బకొట్టడంద్వారా గెలుపు సులభంగా దక్కించుకోవాలనే యోచనలో టీడీపీ ఉంది. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గంలో విజయం సాధించేందుకు ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో కీలకమైన నియోజకవర్గం కమలాపురం. ప్రస్తుతం ఇక్కడినుంచి వైసీపీ తరఫున పొచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 27,333 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ తరఫున పోటీచేసిన పుత్తాపై 5,345 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ విజయం దక్కించుకుంది.

1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1994,2004 ఎన్నికల్లోనే టీడీపీ గెలవగలిగింది. 94, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వీరశివారెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూడా పోటీచేసి గెలుపు దక్కించుకున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులే రెండుసార్లు గెలుపొందారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయినప్పటికీ బీజేపీ, జనసేనతో కలిసి ఏర్పడే కూటమి బలంద్వారా విజయం సాధిస్తామనే ధీమాలో టీడీపీ ఉండగా, మూడోసారి కూడా గెలుపు తమదే అని వైసీపీ అంటోంది. ప్రజలు ఏ పార్టీకి విజయం కట్టబెడతారో చూడాలి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications