పవన్ కల్యాణ్ కుడిభుజంగా జగన్ సొంత జిల్లా అధికారి ?, అదే జరిగితే కడప కూసాలు ?
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఇంటికి వెళ్లిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారం దూరం కావడంతో వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నాయకులు నిరాశగా ఉన్నారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అయితే వైసీపీ నాయకులు చాలా నిరాశగా ఉన్నారని వెలుగు చూసింది.
వైఎస్ జగన్ సొంత జిల్లా కడప మీద సీఎం చంద్రబాబు నాయుడితో పాటు డీసీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అదే కడపకు చెందిన అధికారిని దగ్గర పెట్టుకుని చక్రం తిప్పాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్లాన్ చేశారని తెలిసింది. కడప ఆర్డీఓగా పని చేస్తున్న మధుసూదన్ ను పవన్ కల్యాణ్ ఓఎస్డీగా నియమించాలని చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని అధికారుల పేర్లు పరిశీలించిన తరువాత పవన్ కల్యాణ్ కడన ఆర్డీఓ మధుసూదన్ ను ఓఎస్డీగా నియమించుకోవాలని బావిస్తున్నారని సమాచారం ఇదే సమయంలో కడప ఆర్డీఓ మధుసూదన్ ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలవడంతో ఆయన నియమాకం దాదాపు ఖాయం అయ్యిందని, అధికారికంగా ప్రకటించాల్సి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో కడప ఆర్డీఓ మధుసూదన్ శక్తివంచన లేకుండా విధులు నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకుల ప్రలోభాగాలకు లొంగకుండా ధైర్యంగా విధులు నిర్వహించారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ దగ్గర సమర్థవంత అధికారిగా మధుసూదన్ పేరు తెచ్చుకున్నారు. కడప జిల్లాలో అప్పటి అధికార వైసీపీ నాయకుల బెదిరింపులకు కూడా మధుసూదన్ భయపడలేదని ఆ జిల్లా ప్రజలు అంటున్నారు.
ఇలాంటి సిన్సియర్ అధికారిని తన దగ్గర ఓఎస్డీగా పెట్టుకుంటే ప్రజలకు ఇంకా మెరుగైన సేవ చెయ్యడానికి అవకాశం ఉంటుందని బావించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన వైపు మొగ్గు చూపారని తెలిసింది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను నియమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చెయ్యాల్సి ఉంది.












Click it and Unblock the Notifications