Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుర్చీ గోలపై కడప రెడ్డమ్మ షాకింగ్..! అసలు జరిగింది అదేనట...!

నిన్న దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకల్ని అంతా ఘనంగా జరుపుకున్నారు. అదే సమయంలో ఏపీలో కడపలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాత్రం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి మాత్రం అలిగారు. దీనికి కారణం ఆమెకు తగిన సీటు కేటాయించకపోవడమే. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనకు కేటాయించిన సీటులో కూర్చొన్నారని ఆమె అలిగి కాసేపు అక్కడే నిలబడి అధికారులపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీనిపై వైసీపీ విమర్శలు గుప్పించింది. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి గతంలో కార్పోరేషన్ లో మేయర్ సీటు పక్కనే సీటు కావాలంటూ ఇలాగే కొట్లాడారని, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా అదే సీటు కోసం అలిగి వెళ్లిపోయారంటూ ఆమెను టార్గెట్ చేసింది. దీంతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి దీనిపై ఎక్స్ లో స్పందిస్తూ ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు. ఇందులో నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

Kadapa TDP MLA Madhavi Reddy Clarifies Seat Allotment Row at Independence Day Event

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారుల ఆహ్వానం మేరకు హాజరయ్యానని, కానీ తనకు కేటాయించిన ప్రదేశంలో వేరే అతిథులు కూర్చొన్నారని ఎమ్మెల్యే మాధవీరెడ్డి తెలిపారు. అక్కడ కూర్చున్నవాళ్లు మన అధికారుల కుటుంబ సభ్యులే అన్నారు. వారిని అక్కడి నుంచి పంపేసి తాను కూర్చోవడం పద్ధతి కాదనిపించిందని, అందుకే నిల్చుని కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళిపోయానని వివరణ ఇచ్చారు. ఈ చిన్న విషయంపై సోషల్ మీడియాలో అంత సమయం కేటాయించి పెద్ద చర్చ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

Kadapa TDP MLA Madhavi Reddy Clarifies Seat Allotment Row at Independence Day Event

అయితే నిన్న ఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలు చూస్తే మాత్రం అధికారులపై మాధవీరెడ్డి చిరుబుర్రులాడటం స్పష్టంగానే కనిపించింది. జేసీ అతిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన భర్త పక్కనే కాసేపు నిలబడిన దృశ్యాలు నిన్న బయటికి వచ్చాయి. కానీ ఇదే చిన్న విషయమని మాధవీరెడ్డి కొట్టిపారేశారు. ఓవైపు అధికారుల కుటుంబ సభ్యుల్ని సీటు ఖాళీ చేయమని చెప్పలేక వెళ్లిపోయినట్లు ఆమే చెప్పుకున్నారు. దీనిపైనా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+