టీడీపీలో మరో వికెట్ డౌన్.. వైసీపీలో చేరిన కీలక నేత
ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పార్టీలు మారే నేతల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి.. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా టీడీపీకి షాక్ ఇస్తూ అధికార పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కదిరి టికెట్ ఆశించిన అత్తార్ చాంద్ బాషా..టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు.
టీడీపీలో ఉంటే రాజీకయ భవిష్యత్తు ఉండదని భావించిన ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఆ వెంటనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.

కదిరి టికెట్‌ను వెంకటప్రసాద్‌కు చంద్రబాబు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న అత్తార్ చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరిన చాంద్ బాషా టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు తనని మోసం చేశాడని.. ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా తనని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చాంద్ బాషా హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే చాంద్ బాషా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో చాంద్ బాషా టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి సిద్ధారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కదిరి టికెట్ ఆశించి భంగపడ్డ చాంద్ బాషా.. తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. తనని నమ్మి అసెంబ్లీకి పంపించిన జగన్మోహన్ రెడ్డికి తాను ఎప్పుడు కృతజ్క్షుడినే అని చాంద్ బాషా వ్యాఖ్యానించారు












Click it and Unblock the Notifications