నెల్లూరులో కాజల్ సందడి: యువత కేరింత
నెల్లూరులో తళుక్కుమంది సినీ నటి కాజల్. నగరంలోని కందుకూరు షాపింగ్ మాల్ పునఃప్రారంభానికి హాజరైన ఆమె జ్యోతిప్రజ్వలన చేశారు. కాజల్ సింహపురికి చేరుకోవడంతో యువత కేరింతలు కొట్టారు. భారీగా షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్న కుర్రకారు... కాజల్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఓ దశలో యువతను అదుపు చేయలేక పోలీసులు సైతం నానా హైరానా పడ్డారు. షాపింగ్ మాల్ ఆధునీకరించి సింహపురి వాసులకు వస్త్రాలను చవకగా ఇస్తున్న సంస్థ కందుకూరి అని ఆ సంస్ధ అధినేత విజయభాస్కర్ చెప్పారు.












Click it and Unblock the Notifications